Advertisement

Advertisement


Home > Movies - Movie News

'కామ్రేడ్' తోడు కోసం 'లీడర్'

'కామ్రేడ్' తోడు కోసం 'లీడర్'

ఎంత గొప్ప సినిమా అయినా మరో పెద్ద సినిమా తోడు వుండాల్సిందే. నానీస్ గ్యాంగ్ లీడర్ సినిమా ఆగస్టులో విడుదలకు సిద్దం అవుతోంది. అయితే ఇప్పటి నుంచే ప్రచారం స్టార్ట్ చేయాలని డిసైడ్ అయ్యారు. ప్రీలుక్, ఫస్ట్ లుక్, టీజర్ ఈ మూడూ ఈ నెల 25లోగానే వచ్చేస్తున్నాయి. అలా రావడానికి కూడా కారణం వుంది. 

ఈనెల 25న విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్ విడుదల అవుతోంది. గ్యాంగ్ లీడర్ టీజర్ కనుక విజయ్ సినిమాతో థియేటర్లకు పంపిస్తే, మాంచి బజ్ వస్తుందని నిర్మాతలు, హీరో కలిసి ప్లాన్ చేసినట్లు బోగట్టా. రెండు సినిమాలకు నిర్మాతలు మైత్రీ మూవీస్ నే. ఏమయినా విజయ్ సినిమాకు వుండే క్రేజ్ వేరు. అలాంటి సినిమాతో నాని సినిమా టీజర్ జనాల్లోకి పంపిస్తే, ఫాస్ట్ గా దూసుకుపోయే అవకాశం వుంది. అందుకే ఆ విధంగా ప్లాన్ చేస్తున్నారు. 

అందుకే ఈ నెల 13న ప్రారంభించి 25లోగా ప్రీలుక్, ఫస్ట్ లుక్, టీజర్ వదిలేస్తారు. ఆ తరువాత మెల్లగా సింగిల్ సాంగ్స్ వదలడం ప్రారంభించి వచ్చేనెల 15 నాటికి ఫినిష్ చేస్తారు. వీలయితే సాహోతో పాటు ట్రయిలర్ ను థియేటర్లలలోకి పంపిస్తారు. విక్రమ్ కే కుమార్ డైరక్షన్లో నాని చేస్తున్న నానీస్ గ్యాంగ్ లీడర్ సినిమాకు నాని మార్కెట్ ను మించి ఖర్చు చేసినట్లు బోగట్టా. అందుకే ఇప్పటి నుంచి ప్లాన్డ్ గా పబ్లిసిటీని ప్లాన్ చేస్తున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?