మేనరికం పెళ్లిళ్లను వైద్య శాస్త్రం తప్పు పడుతుంది. మేనరికం పెళ్లిళ్ల లో కలిగే సంతానాల్లో కొన్ని శారీరక, మానసిక సమస్యలు తలెత్తుతూ ఉంటాయనే వాదన ఉంది. అధునాతన వైద్య శాస్త్రం మేనరిక వివాహాలను తప్పు పడుతుంది. అయితే పెళ్లికి ముందు కొన్ని పరీక్షలు చేయించుకుని, మేనరిక వివాహాలకు కూడా సిద్ధం కావొచ్చనే వాదనా వైద్య శాస్త్రం వైపు నుంచినే వినిపిస్తుంది. అయితే వైద్యం ఏమన్నా.. మేనరికాలు మనదేశంలో ప్రత్యేకించి దక్షిణభారతదేశంలో చాలా ఎక్కువ! ఇప్పటికీ ఎంతో మంది మేనరికం పెళ్లిళ్లు చేసుకుంటూనే ఉంటారు. గత తరంలో ఇది మరింత ఎక్కువ! మేనరికం లో ఉన్నారంటే.. వారితో పెళ్లే!
మరి ఇది కేవలం భారతదేశంలోనే కాదు.. ఈ మేనరికాలు, బంధువుల్లోనే పెళ్లిళ్లు చేసుకోవాలనే సంప్రదాయం బ్రిటన్ రాజవంశంలో కూడా ఉండేది! రాజుల లెక్కలో వారి రక్తం చాలా పవర్ ఫుల్! వారి రక్తం ప్రత్యేకం! అలాంటి రక్తం ఎవరితో అంటే వారితో కలవకూడదు! మరో రాయల్ కుటుంబం తో వియ్యం అందుకుంటేనే అది తమ స్థాయికి తగ్గట్టు! అయితే ఇలాంటి రాయల్ ఫ్యామిలీస్ నంబర్ బాగా తక్కువ!
వేల్స్ రాజ కుటుంబం, స్కాట్ లాండ్ రాజకుటుంబం, ఇంకా .. డెన్మార్క్ రాజకుటుంబం. ఇలా యూరప్ లో కొన్ని దేశాలకు రాజ కుటుంబాలున్నాయి. వీటి మధ్య వియ్యమందే సంప్రదాయం కొనసాగింది. ఈ సంప్రదాయాలు 'రాయల్ డిసీజ్' కు కారణమయ్యాయి!
ఈ రాజకుటుంబాలు తమ స్థాయి అనుకుంటూ.. వరసకు బంధువులతోనే పెళ్లిళ్లు చేయసాగారు. దీంతో మనదగ్గర మేనరికం పెళ్లిళ్లలో సంతానంలో తలెత్తే సమస్యలే రాయల్ ఫ్యామిలీని కూడా ఇబ్బంది పెట్టాయి! అందుకే మేనరికం పెళ్లిళ్లతో కలిగిన సంతానంలో సమస్యలు తలెత్తితే వాటిని కూడా 'రాయల్ డిసీజ్' గా పరిగణిస్తారు వైద్య శాస్త్ర పరిభాషలో!
రోజులు మారాయి. బ్రిటన్ వంటి రాజరిక కుటుంబంలోని వారు కూడా తమ కుటుంబాలను వీడి వేరే వాళ్లను వివాహం చేసుకుంటూ వస్తున్నారు. అయితే ఇలాంటి వివాహాలు వారిలో వివాదాలను రేపాయి. ప్రిన్స్ చార్లెస్ తో డయానా స్పెన్సర్ విడాకులు, డయానా చిన్న కొడుకు అంతఃపురాన్ని వీడి తన భార్యతో అమెరికా వెళ్లిపోవడం కూడా రాజరికంలో పెళ్లిళ్ల వెనుక ఉన్న కష్టాలను చాటేవే!