మాజీ మంత్రులను కలిపిన బాబు విజన్

తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ విజన్ బాగానే పనిచేసింది. ప్రజల సంగతేమో కానీ పార్టీలో సీనియర్ నేతలను ఒక చోటకు చేర్చడానికి ఉపయోగపడింది.  విశాఖ బీచ్ లో చంద్రబాబు సమైక్య వాక్ పేరిట చేసిన పాదయాత్రలో…

తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ విజన్ బాగానే పనిచేసింది. ప్రజల సంగతేమో కానీ పార్టీలో సీనియర్ నేతలను ఒక చోటకు చేర్చడానికి ఉపయోగపడింది.  విశాఖ బీచ్ లో చంద్రబాబు సమైక్య వాక్ పేరిట చేసిన పాదయాత్రలో తెలుగుదేశం నాయకులు అంతా పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

వారిలో అందరి దృష్టీ విశాఖ అర్బన్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, రూరల్ జిల్లాకు చెందిన చింతకాయల అయ్యన్నపాత్రుడు మీదనే ఉంది. ఈ ఇద్దరు మాజీ మంత్రులు ఒకే పార్టీలో ఉన్నా కలసి కార్యక్రమాలలో కనిపించినది పెద్దగా ఉండదని ప్రచారంలో ఉన్న మాట.

ఇపుడు ఎటూ చంద్రబాబే విశాఖలో పాదం మోపారు. రెండున్నర కిలోమీటర్ల పాదయాత్రకు సిద్ధపడ్డారు. బాబు వెనకాల నడించేందుకు తమ్ముళ్ళు పోటీ పడ్డారు. అర్బన్, రూరల్ జిల్లాల పార్టీ ప్రెసిడెంట్లతో పాటు మాజీ మంత్రులు అంతా ఆయన్ని అనుసరించారు.

అలా కుడి ఎడమలుగా గంటాను, అయ్యన్నను పెట్టుకుని బాబు సమైక్య వాక్ నే చేశారు. ఇది టీడీపీ అంతా ఒక్కటి అని చాటి చెప్పేందుకు ఉపయోగపడేలా ఉందని అంటున్నారు. గంటా నాలుగేళ్ళ తరువాత టీడీపీలో రీ యాక్టివ్ అయ్యారు. అయ్యన్నపాత్రుడు అయితే ఆ మధ్యనంతా గంటా మీద ఇండైరెక్ట్ గా కామెంట్స్ చేసారు.

పార్టీలో పనిచేయని వారిని పక్కన పెట్టాలని ప్రాధాన్యత ఇవ్వరాదని డిమాండ్ చేశారు. అయితే గంటా తనదైన రాజకీయ చతురతతో అధినాయకత్వం మెప్పు పొందారు. ఆయన ఇపుడు మీడియా ముఖంగా పార్టీలో పెద్ద గొంతుక అవుతున్నారు. ఈ సమయంలో ఇద్దరు మాజీలను వెంటబెట్టుకుని బాబు చేసిన పాదయాత్ర ఆయన విజన్ డాక్యుమెంట్ ని పక్కన పెడితే జిల్లాలో టీడీపీకి మేలు చేసేదిగానే ఉందని అంటున్నారు.