టాలీవుడ్ లో మరో విషాదం నెలకొంది. సీనియర్ నటుడు, కేంద్ర మాజీ మంత్రి రెబల్ స్టార్ కృష్ణంరాజు కన్నుమూశారు. హైదరాబాద్ లో ఈ రోజు తెల్లవారుజామున 3.25 నిమిషాలకు కన్నుమూశారు. గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
పశ్చిమ గోదావరి జిల్లా మెగల్తూరులో కృష్ణం రాజు జన్మించారు. ఆయన పూర్తి పేరు ఉప్పలపాటి వెంకట కృష్ణం రాజు 1966లో సినిమాలోకి రంగ ప్రవేశం చేశారు. దాదాపు 183కు పైగా సినిమాల్లో నటించారు.
సినిమాల్లో నటిస్తూ రాజకీయ ప్రవేశం చేశారు. జనతా పార్టీ తరుపున 12వ లోక్ సభ ఎన్నికల్లో కాకినాడ నుండి ఎంపీ అయ్యారు, అలాగే 13వ లోక్ సభకు నరసాపురం లోక్ సభ నియోజకవర్గం నుండి ఎన్నికై వాజపేయి మంత్రివర్గంలో మంత్రిగా పని చేశారు. 2009 లో ప్రజరాజ్యం తరుపున పోటీ చేసి ఓడిపోయారు.
రెబల్ స్టార్ కృష్ణంరాజు.. హీరోగా ప్రత్యేకమైన మాడ్యులేషన్, డైలాగ్ డెలివరీలతో తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను, అభిమానులను సంపాదించుకున్న కథానాయికుడు. హీరోగా కెరీర్ మొదలు పెట్టి.. ఆ పై విలన్ గా మారి.. ఆపై కథానాయకుడిగా రెబల్ స్టార్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.