బాబు గారు! కర్మని అనుభవించాల్సిందే

కర్మసిద్ధాంతం పుస్తకాల్లోనో, సినిమాల్లోనో మాత్రమే కాదు కళ్ల ముందు కూడా కనిపిస్తుంటుంది. “చేసుకున్నవాడికి చేసుకున్నంత మహదేవ”, “ఎవడు తీసిన గోతిలో వాడే పడడం” లాంటి నానుడులు ఊరికే పుట్టలేదు. చంద్రబాబు నాయుడు చరిత్ర కర్మసిద్ధాంతానికి…

కర్మసిద్ధాంతం పుస్తకాల్లోనో, సినిమాల్లోనో మాత్రమే కాదు కళ్ల ముందు కూడా కనిపిస్తుంటుంది. “చేసుకున్నవాడికి చేసుకున్నంత మహదేవ”, “ఎవడు తీసిన గోతిలో వాడే పడడం” లాంటి నానుడులు ఊరికే పుట్టలేదు. చంద్రబాబు నాయుడు చరిత్ర కర్మసిద్ధాంతానికి నిలువెత్తు తార్కాణం. 

నమ్మినబంటులా ఉంటూనే మామగారికి వెన్నుపోటు పొడిచి పార్టీని లాక్కున్నాడు. ఇప్పుడు కొడాలి, వల్లభనేని వంటి నాయకులు తమ కత్తుల్లాంటి మాటలతో చంద్రబాబుని వందసార్లు ఎదురుపోటు పొడుస్తూనే ఉన్నారు. వీరిద్దరూ గతంలో చంద్రబాబు నీడలో నమ్మినబంటుల్లా ఉన్నవారే. 

తెలుగుదేశంపార్టీ భవితవ్యం కోసం అనర్హురాలైన లక్ష్మీపార్వతిని పక్కకు తోసేసి, ఎన్.టి.ఆర్ ని కిందకు లాగేసి తాను కుర్చీ ఎక్కేసేనన్నాడు చంద్రబాబు. కర్మసిద్ధాంతమో, ఎన్.టి.ఆర్ శాపమో తెలీదు కానీ ఇప్పుడు పార్టీ వారసుడిగా కొడుకుకి పట్టాభిషేకం చేద్దామంటే అతను అందరి చేత అనర్హుడనే ముద్ర వేయించుకున్నాడు. 

నందమూరి వారసత్వాన్ని పార్టీకి దూరం చేసి అంతా “నారా మయం” చేసాడు. కానీ అదేంటో ఈ మధ్యన పార్టీ కార్యకర్తలే బహిరంగంగా లోకేష్ ని పక్కన పెట్టమని అరుస్తూ జూనియర్ ఎన్.టి.ఆర్ బొమ్మలున్న జెండాలూపుతున్నారు. మొన్నటికి మొన్న బాలకృష్ణ హిందూపురంలో చంద్రబాబు ఫొటో లేకుండా, కేవలం తన మరియు స్వర్గీయ ఎన్.టి.ఆర్ ఫొటోతో ఆరోగ్యశకటం ప్రవేశపెట్టి బహిరంగంగానే నందమూరి ఆధిపత్యం చూపాడు. 

చంద్రబాబు కళ్ల ముందే కట్టుకున్న మేడలు కూలుతున్నాయి. ఎవరు తనవాళ్లో, ఎవరు కాని వాళ్లో, ఎవరు అవకాశవాదులో, ఎవరు పక్కలో బల్లేలో తెలియని దీనస్థితి చంద్రబాబు ఆవహించింది.

తెదేపా కార్యాలయాల మీద దాడులు జరిగినప్పుడు చంద్రబాబు శిబిరంలో దీక్ష చేసిన సంఘటన ఒకసారి గుర్తుచేసుకోవాలి.ఆ సమయంలో తేదేపా నాయకులందరూ వచ్చి తాము లేస్తే  మనుషులం కాదని, ఈ సారి పార్టీ జోలికొస్తే రాష్ట్రాన్ని షేక్ చేస్తామని, బాబు గారి గౌరవమే తమ పార్టీ గౌరవమని రకరకాలుగా స్పీచులు దంచారు.

కానీ అసెంబ్లీలో తన భార్యని ఎవరో ఏదో అన్నారని ప్రెస్మీట్లో ఎక్కెక్కి ఏడ్చిన చంద్రబాబుకి ఒక్క నాయకుడు అండగా నిలబడలేదు. బహుశా ఆ ఏడుపుకి రాష్ట్రమంతా షేకౌతుందని చంద్రబాబు అనుకుని ఉండొచ్చు. మట్టిబెడ్డ కూడా కదల్లేదు. పాపఫలితాన్ని అనుభవిస్తున్నప్పుడే తనవాడు అనుకున్నవాడు కూడా అండగా నిలబడడు. 

ఇప్పుడు కొత్తగా కొడాలి నాని అనరాని మాటలు అనేసాడు. “ఎక్కడ పుట్టినా ఎక్కడ పొర్లినా నా ఇంట్లో ఈనితే దూడ నాదే” లాంటి వాక్యాలతో చంద్రబాబు సతీమణిపై వల్లభనేని వంశీ తర్వాత మళ్లీ పరోక్షంగా వ్యక్తిగత దాడి చేసేశాడు. ఎక్కడో ఒక బుద్ధా వెంకన్న చంపేస్తానని ఒక మొక్కుబడి పంచ్ లైన్ తప్ప తెదేపా నాయకులు చీమ చిటుక్కుమన్న శబ్దం కూడా చేయలేదు. 

ఇది చూసి రాష్ట్రం రావణకాష్టం అవ్వట్లేదేంటా అని ఒక పచ్చ ఛానల్ సీ.ఈ.వో “తెలుగు దేశం నాయకులు సైనైడ్ తాగి చచ్చిపోయారు”, అంటూ ఎమోషనల్ డ్రామా ప్లే చేసి రెచ్చగొట్టే ప్రయత్నం చేసాడు. “ఇదా రాజకీయమంటే?” అని ప్రశ్నించాడు. 

కచ్చితంగా కాదు. అయితే ఈ దరిద్రానికి మూలం ఎవరు? రాజకీయానికి రంకు రంగు పులిమడంలో ఆద్యులెవరు?

ఒక్కసారి వెనక్కి వెళ్లి చూద్దాం.

వై.ఎస్. షర్మిలకి ఐటీడీపీ బృందం ఒక అసహ్యకరమైన మచ్చని అంటించి రాజకీయమాడారు. 

తెదేపా నాయకుడు పట్టాభి జగన్ మోహన్ రెడ్డిని “బో…కే” అనే పదంతో పరోక్షంగా తల్లి విజయమ్మకు మచ్చ అంటేలా నోరుపారేసుకున్నాడు. ఈ మధ్య జగన్ మోహన్ రెడ్డి సతీమణి భారతిని కూడా లిక్కర్ మాఫియాలోకి లాగారు. 

ఇవన్నీ చేసిందెవరు? పచ్చ మీడియా మరియు ఐ టీడీపీ సౌజన్యమే కదా! వీరికి అండ, దండ, వెన్నెముక తెదేపా తండ్రీకొడుకులే కదా! కాదని ప్రూవ్ చేయడం ఎవరి తరం కాదు. ఎందుకంటే వైకాపా నాయకుల కుటుంబ సభ్యుల మీద అనుచిత వీడియోలు పెట్టిన ఘర్షణ టీవీ వెంగళ్రావు అరెస్టైతే బహిరంగంగానే వెన్నుదన్నుగా నిలిచారు తండ్రీకొడులు. పైగా అలాంటి పనులు ఎవ్వరైనా చేయొచ్చని..అరెస్టైతే బెయిలిప్పిస్తామని చినబాబు పబ్లిక్ గా చెప్పడం రాక్షసత్వానికి పరాకాష్ట కాదా!

అందుకే ఇక్కడ తెదేపా కుట్రలకి వివరణిలిచ్చుకునే డిఫెన్స్ మెకానిజం ఒక్కటీ సరిపోదు. డబల్ అఫెన్సివ్ గా విరుచుకుపడడమే కరెక్టనుకునే స్థితికి వైకాపా చేరింది.  

అందుకే పరిటాల వర్గంలో ఉండి, తెదేపా నీడలో దశాబ్దాలుగా ఉన్న పోతుల సునీత కూడా నేడు వైకాపా శిబిరం నుంచి తెదేపా కుటుంబ సభ్యులైన బ్రాహ్మణిని, భువనేశ్వరిని తాగుబోతులంది. అమ్మాయిలు పక్కలో లేకుండా లోకేష్ పొడుకోలేడంది. యాక్షన్ కి రియాక్షనన్నమాట. ఒక చెంప మీద కొడితే మొత్తం మొహమంతా పగలకొట్టేస్తున్నారు వైకాపా వర్గం. 

ఈ దరిద్రం ఆగాలంటే నిర్ణయం చంద్రబాబు-లోకేష్ చేతిల్లోనే ఉందన్నది నిర్వివాదాంశం. ఇది ఒక పార్టీ తరపున వకాల్తా పుచ్చుకుని రాస్తున్నది కాదు. “ఏది ముందు- ఏది తర్వాత” అనేది పరిశీలించి, పరిశోధించి రాస్తున్నది. 

ఇంతకీ తండ్రీకొడుకులు ఏం చెయ్యాలంటే ఐటీడీపీ మరియు పచ్చ మీడియా వర్గాల్ని వైకాపా నాయకుల కుటుంబ సభ్యుల జోలికి రాకుండా ఆపాలి. అప్పుడు కచ్చితంగా రాష్ట్రప్రజలకి ఈ బూతుపురాణాలు వినే దౌర్భాగ్యం తప్పుతుంది. ఒకవేళ ఆపినా వైకాపా వర్గం వాళ్లు తెదేపా వారి కుటుంబ సభ్యుల జోలికొస్తే అప్పుడు ఇంతకన్నా ఘాటైన వ్యాసం తేదేపాకి అండగా నిలబడి రాయడం తధ్యం.

ఈ వ్యాసం ద్వారా చంద్రబాబు గారికి చెప్పేది ఒక్కటే. చేసుకున్న కర్మని అనుభవించక తప్పదు. కొత్త దుష్కర్మలు చేసి నొప్పిని మరింత పెంచుకోకండి. ఎలా చూస్తున్నా విధి మీ పక్షాన లేదు. విధికి తల వంచి పశ్చాత్తాపం చెంది, ఆరోగ్యకరమైన రాజకీయం చేస్తే ఏమన్నా ప్రయోజనముండచ్చేమో కానీ ప్రత్యర్థిని ఇన్నాళ్లూ మీకు తెలిసిన పద్ధతిలో ఎదుర్కోవాలంటే మాత్రం ఇక మీ శేషజీవితం అసెంబ్లీకి అడుగుపెట్టకుండానే ముగిసిపోవచ్చు. 

–  హరగోపాల్ సూరపనేని