మరోసారి మహేష్ మెగా ఫైట్

సూపర్ స్టార్ మహేష్ బాబుకు మరోసారి మెగా హీరోతో పోటీ తప్పడం లేదు. 2020 లో బన్నీతో పోటీ పడాల్సి వచ్చింది. ఈసారి పవన్ కళ్యాణ్ తో పోటీ పడాల్సి వస్తోంది. 2022 సంక్రాంతి…

సూపర్ స్టార్ మహేష్ బాబుకు మరోసారి మెగా హీరోతో పోటీ తప్పడం లేదు. 2020 లో బన్నీతో పోటీ పడాల్సి వచ్చింది. ఈసారి పవన్ కళ్యాణ్ తో పోటీ పడాల్సి వస్తోంది. 2022 సంక్రాంతి సర్కారువారి పాట విడుదల అని ఎప్పడో ప్రకటించారు. ఇప్పుడు మరో సినిమా ప్రకటన రాబోతోంది.

అయ్యప్పన్ కోషియమ్ రీమేక్ విడుదలను 2022 సంక్రాంతి సీజన్ కే అని ఫిక్స్ చేసారు. అయితే గతంలో సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో మాదిరిగా పక్క పక్కన కాకుండా కాస్త వన్ వీక్ గ్యాప్ ఇచ్చి విడుదల చేసుకుంటారు. 

మహేష్ సర్కారు వారి పాట కు పరుశురామ్ డైరక్టర్. పవన్ అయ్యప్పన్ రీమేక్ కు సాగర్ దర్శకుడు అయినా, తెరవెనుక కర్త..కర్మ..క్రియ అంతా త్రివిక్రమ్ నే. అందువల్ల ఒక విధంగా కాదు అనేక విధాలుగా ఇది త్రివిక్రమ్ సినిమానే. 

అయినా నిర్మాతలు, దర్శకులు, హీరోలు ఎలా ఫీలయినా కాకపోయినా మరోసారి మహేష్-మెగా ఫ్యాన్స్ నడుమ వార్ ఓ రేంజ్ లో వుంటుంది.