బాబు అసెంబ్లీకి రావాలి!

ఈ నెల 15వ తేదీన నుండి ఏపీ అసెంబ్లీ స‌మావేశాలు జరుగ‌నున్న‌ట్లు ఏపీ గ‌వ‌ర్న‌ర్ విశ్వ‌భూష‌ణ్ హ‌రిచంద‌న్ తాజాగా నోటిఫికేష‌న్ విడుద‌ల చేయ‌డంతో అసెంబ్లీ స‌మావేశంలో ఎటువంటి రాజకీయ అస‌క్తిక‌ర‌ ప‌రిణామాలు జ‌ర‌గ‌బోతాయి అనేది…

ఈ నెల 15వ తేదీన నుండి ఏపీ అసెంబ్లీ స‌మావేశాలు జరుగ‌నున్న‌ట్లు ఏపీ గ‌వ‌ర్న‌ర్ విశ్వ‌భూష‌ణ్ హ‌రిచంద‌న్ తాజాగా నోటిఫికేష‌న్ విడుద‌ల చేయ‌డంతో అసెంబ్లీ స‌మావేశంలో ఎటువంటి రాజకీయ అస‌క్తిక‌ర‌ ప‌రిణామాలు జ‌ర‌గ‌బోతాయి అనేది ప్ర‌జ‌ల్లో చ‌ర్చ జ‌రుగుతోంది.

అసెంబ్లీ స‌మావేశాల్లో నాయ‌కులు ప్ర‌జ స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చ కంటే వ్య‌క్తిగ‌తంగా ఎలా ఒక‌రిపై ఒక‌రు బురద చల్లుకుంటారు అనేది ప్ర‌జ‌ల‌కు బాగా ఇష్టం. ఇప్పుడు దానికి తోడుగా గ‌త అసెంబ్లీ స‌మావేశాల్లో చంద్ర‌బాబు నాయుడు.. ఇంకా నేను అసెంబ్లీ రాను అంటూ ఛాలెంజ్ చేసీ, మీడియా స‌మావేశంలో గుక్క పెట్టి ఏడ‌వ‌డంతో మ‌రింత అతృత క‌న‌ప‌డుతోంది. ఈ సారి ఆయ‌న స‌మావేశాల‌కు వ‌స్తారా లేదా అనేది తెలియాలి. 

ఎందుకంటే చంద్ర‌బాబు ఎప్పుడు కూడా త‌న మాట‌ల‌కు క‌ట్టుబ‌డి ఉండ‌డూ అనేది జగమెరిగిన సత్యం. ఇక‌పై ముఖ్య‌మంత్రి అయితేనే అసెంబ్లీలో అడుగు పెడ‌తా అని చెప్పి.. రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల సంద‌ర్భంలో అసెంబ్లీకి వెళ్లి ఓటు వేశారు అప్పుడే చంద్ర‌బాబు గురించి అంద‌రికి క్లారిటీ వ‌చ్చింది. అందుకే బాబు ను వ్య‌తిరేక ప‌క్షాలు ముద్దుగా 'యూ- టర్న్ బాబు' అని పిలుస్తుంటారు.

అలాగే ఈ సారి అసెంబ్లీ స‌మావేశాల్లో అధికార పార్టీ వైసీపీ ప్ర‌భుత్వం మ‌రో సారి మూడు రాజ‌ధానుల బిల్లులు ప్ర‌వేశ పెట్ట‌బోతున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కొంత మంది వైసీపీ నాయ‌కులు మూడు రాజ‌ధానుల బిల్లు త‌ప్ప‌కుండా చేసి తీరుతాం అంటున్నారు. మ‌రో వైపు అమ‌రావ‌తి రైతుల పేరిట పాద‌యాత్ర చేస్తున్నారు.

పోలవరం ప్రాజెక్టులో ఎదురవుతున్న సమస్యలు.. గత ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాల గురించి సభ ద్వారా ప్రజల ముందు ఉంచాలని వైసీపీ భావిస్తున్న‌ట్లు క‌న‌ప‌డుతోంది. అసెంబ్లీ స‌మావేశాల‌ని ఈ సారి చంద్ర‌బాబు వెళ్లి వైసీపీ ప్ర‌భుత్వం చేస్తున్నా త‌ప్పుల‌ను ఎత్తిచూపాల‌ని టీడీపీ నాయ‌కులు కొరుకుంటున్నారు.