పెద్ద సినిమాల పిరికితనం

కరోనా కల్లోలం ఒకవైపు…టికెట్ ల సమస్య ఇంకో వైపు. జనాలను ఆకట్టుకోవాలి. థియేటర్లు ఈ కొత్త రేట్లతో ఏ రేంజ్ లో వసూలు చేస్తాయో చూడాలి. వాటిని బట్టి కొత్డ డిస్ట్రిబ్యూషన్ సూత్రాలు లెక్కలు…

కరోనా కల్లోలం ఒకవైపు…టికెట్ ల సమస్య ఇంకో వైపు. జనాలను ఆకట్టుకోవాలి. థియేటర్లు ఈ కొత్త రేట్లతో ఏ రేంజ్ లో వసూలు చేస్తాయో చూడాలి. వాటిని బట్టి కొత్డ డిస్ట్రిబ్యూషన్ సూత్రాలు లెక్కలు వేయాలి. 

ఇలా జరగాలంటే ఎవరో ధైర్యం చేయాలి. కానీ ఒక్కరంటే ఒక్క పెద్ద సినిమా నిర్మాత ధైర్యం చేయడం లేదు. ఒక కోటి రూపాయలు అటు ఇటు అయినా తట్టుకోగల బడా బాబులు ధైర్యం చేయడం లేదు. ఇంకా సేఫ్ జోన్ లోనే గేమ్ ఆడుతున్నారు. కాదూ అంటే ఓటిటి వైపు దృష్టి పెడుతున్నారు. 

ఇలాంటి నేపథ్యంలో చదరంగంలో బంట్లు ముందుగా కదిలినట్లు..యుద్దంలో సైనికులు ముందుగా రంగంలోకి దిగినట్లు రెండు చిన్న సినిమాలు ఈ వారం రంగంలోకి దిగుతున్నాయి. వాటి పరిస్థితి చూసాక పెద్ద సినిమాలు బోర విరుచుకుని, ధైర్యంగా రంగంలోకి దిగుతాయన్నమాట,. 

తేజ సజ్జా నటించిన ఇష్క్, సత్యదేవ్ నటించిన తిమ్మరసు సినిమాలు రెండూ ఈవారం రంగంలోకి దిగుతున్నాయి. తక్కువ రేట్ల మీద ఆంధ్రలో ఇవి ఎలా వసూళ్లు సాగిస్తాయి? జనాలు ఎలా వస్తారు? ఇవన్నీ తేలితే, వాటిని బట్టి లెక్కలు కట్టుకుని, అంచనాలు వేసుకుని, అప్పుడు రంగంలోకి దిగడానికి పెద్ద సినిమాలు ఆత్రంగా వున్నాయి. 

వ్యాక్సీన్ ను ముందుగా ఎలుకల మీద ప్రయోగించి, ఆ ఫలితాలు చూసి మనుషులు వేసుకున్నట్లుగా, ముందుగా పాపం, ఈ చిన్న సినిమాలను ముందుకు నడిపి, ఆపై పెద్ద సినిమాలు చాలా అంటే చాలా ధైర్యంగా రంగంలోకి దిగుతాయన్నమాట. 

లేదూ పరిస్థితి అనుకూలం కాదు, ఫలితాలు వికటించాయి అంటే బుద్దిగా మళ్లీ ఇంట్లో కూర్చుంటాయి. లేదా ఓటిటికి వెళ్తాయి. అంతే కానీ కోట్లకు కోట్లు వున్న పెద్ద సినిమాల నిర్మాతలు మాత్రం ధైర్యం చేసి టాలీవుడ్ కోసం ఓ అడుగు ముందుకు మాత్రం వేయరు.