ఒకప్పుడు మంచి సినిమాలు అనేకం అందించిన సూపర్ గుడ్ ఫిలింస్ సంస్థ అందిస్తున్న లేటెస్ట్ మూవీ ఇష్క్. జాంబిరెడ్డి, ఓ బేబీ సినిమాలతో నిలదొక్కుకుని, హీరోగా ఎదిగే ప్రయత్నం చేస్తున్న తేజు సజ్జ.. ప్రియా వారియర్, కాంబినేషన్ లో నిర్మించిన సినిమా ఇష్క్. ఈ నెల 30న విడుదల కాబోతున్న ఈ సినిమా ట్రయిలర్ ను ఆన్ లైన్ లో విడుదల చేసారు.
మలయాళం సినిమా ఆధారంగా తయారైన ఇష్క్ సినిమా ఇప్పటి వరకు ఈ సినిమా ఒక లవ్ స్టోరీ అనే అనుకుంటూ వస్తున్నారు. ట్రయిలర్ ఇప్పుడు కొత్త లుక్ ఇచ్చింది సినిమాకు.
పక్కా లవ్ లీ థ్రిల్లర్ అని క్లారిటీ వచ్చింది. ట్రయిలర్ లో థ్రిల్లర్ అన్న విషయం దాచడానికి ఏ మాత్రం ప్రయత్నించలేదు. పైగా థ్రిల్లర్ అనే ప్రొజెక్టు చేయడానికి ప్రయత్నించినట్లు కనిపిస్తోంది.
సినిమాలో సస్పెన్స్ ఎలిమెంట్ కూడా వుందని తెలుస్తోంది. ఎందుకంటే ట్రయిలర్ లో హీరో హీరోయిన్లనే ఎక్కువగా ప్రొజెక్ట్ చేసారు. ట్రయిలర్ కు అందించిన బ్యాక్ గ్రవుండ్ స్కోర్ ఇంట్రస్టింగ్ వుంది.