త్వరలో రాహుల్ విశాఖ టూర్ …?

కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ విశాఖ టూర్ ఉందా. ఆయన ఆ దిశగా ప్లాన్ చేసుకుంటున్నారా అంటే కాంగ్రెస్ వర్గాల నుంచి అవును అనే జవాబు వస్తోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్…

కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ విశాఖ టూర్ ఉందా. ఆయన ఆ దిశగా ప్లాన్ చేసుకుంటున్నారా అంటే కాంగ్రెస్ వర్గాల నుంచి అవును అనే జవాబు వస్తోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ పరం చేయడానికి కేంద్రం దూకుడుగా అడుగులు వేస్తోంది. ఈ విషయంలో ఎవరు చెప్పినా వినే ప్రసక్తి లేదు అని కూడా అంటోంది.

అయితే విశాఖ స్టీల్ ప్లాంట్ ని సరిగ్గా యాభై ఏళ్ల క్రితం అంటే 1971లో  నాటి ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ విశాఖ వచ్చి మరీ శంకుస్థాపన చేశారు. ఆ తరువాత పదేళ్లకు ప్లాంట్ నిర్మాణం మొదలైంది. మరో పదేళ్ళకు ఉత్పత్తి కూడా స్టార్ట్ చేశారు. 

ఒక విధంగా చెప్పాలంటే ప్లాంట్ ఏర్పాటు వెనక కాంగ్రెస్ కృషి ఉంది. దాంతో ఇపుడు రాహుల్ గాంధీ విశాఖ టూర్ పెట్టుకున్నారు అంటున్నారు. తమ నాయనమ్మ ప్లాంట్ కి ఊపిరిపోతే మోడీ తీసేయడానికి ఉత్సాహపడడం పట్ల నిరసనగా  ఆయన విశాఖ వేదికగా చేసుకునే గర్జిస్తారు అంటున్నారు.

ఆరు నెలలుగా ఆందోళనాపధంలో ఉన్న ఉక్కు కార్మికులను ఆయన కలసి మద్దతు ప్రకటిస్తారు అంటున్నారు. మొత్తానికి చూస్తే రాహుల్ టూర్ తో ఉక్కు సమస్య మరింత ఫోకస్ అయ్యే చాన్స్ ఉండవచ్చేమో కానీ ప్రైవేటీకరణ ఆగుతుందా అన్నదే చూడాలి. 

మరో వైపు ఏపీలో కాంగ్రెస్ కి ఊపిరులూదడానికే రాహుల్ ఉక్కు సమస్యను ఫోకస్ చేస్తున్నారని కూడా అంటున్నారు. ఆగస్ట్ నెలలో రాహుల్ విశాఖ టూర్ ఉండే చాన్స్ ఉందని చెబుతున్నారు.