మళ్లీ సెట్స్ పైకొచ్చిన పవన్ కల్యాణ్

లాంగ్ గ్యాప్ తర్వాత పవన్ కల్యాణ్ మరోసారి సెట్స్ పైకొచ్చారు. సాగర్ చంద్ర దర్శకత్వంలో చేస్తున్న అయ్యప్పనుమ్ కోషియమ్ సినిమా రీమేక్ ను స్టార్ట్ చేశారు. హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన ప్రత్యేకమైన సెట్…

లాంగ్ గ్యాప్ తర్వాత పవన్ కల్యాణ్ మరోసారి సెట్స్ పైకొచ్చారు. సాగర్ చంద్ర దర్శకత్వంలో చేస్తున్న అయ్యప్పనుమ్ కోషియమ్ సినిమా రీమేక్ ను స్టార్ట్ చేశారు. హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన ప్రత్యేకమైన సెట్ లో ఈ సినిమా కొత్త షెడ్యూల్ ఇవాళ్టి నుంచి మొదలైంది.

నిజానికి ఈనెల 12నే ఈ సినిమా స్టార్ట్ అవుతుందనుకున్నారు. ఆ మేరకు షూట్ స్టార్ట్ చేయడానికి పవన్ కూడా అంగీకరించారు. కానీ సినిమాటోగ్రాఫర్ తో చిక్కులొచ్చి, సినిమా షెడ్యూల్ ను వాయిదా వేశారు. ఈ సినిమా నుంచి ప్రసాద్ మూరెళ్ల తప్పుకున్నారు. అతడి స్థానంలో కొత్తగా రవి కె.చంద్రన్ ను తీసుకున్నారు. అలా ఓ భారీ మార్పుతో పవన్ కొత్త సినిమా, కొత్త షెడ్యూల్ ఇవాళ్టి నుంచి మొదలైంది.

కరోనా సెకెండ్ వేవ్ వల్ల అన్ని సినిమాల్లానే ఈ సినిమా కూడా ఆగిపోయింది. అదే టైమ్ లో పవన్ కు కూడా కరోనా సోకింది. ఇక అంతా సద్దుమణిగి తిరిగి షూటింగ్స్ మొదలవుతున్న టైమ్ లో, ముందుగా ఇదే సెట్స్ పైకి వస్తుందని అంతా భావించారు. కానీ పవన్ తన పాలిటిక్స్ ను ముందుగా ప్రారంభించారు. 

ఏపీలో నిరుద్యోగుల సమస్యపై చిన్నపాటి ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. అది కూడా పూర్తయిన తర్వాత మరికొన్ని రోజులు రెస్ట్ తీసుకొని, ఈరోజు నుంచి కొత్త సినిమా స్టార్ట్ చేశారు.

పవన్ సెట్స్ పైకి రావడంతో హరిహర వీరమల్లు సినిమా యూనిట్ లో ఊపొచ్చింది. సాగర్ చంద్ర సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసి, క్రిష్ దర్శకత్వంలో వస్తున్న హరిహర వీరమల్లు సినిమాకు షిఫ్ట్ అవుతారు పవన్.