మళ్లీ దిల్ రాజు క్యాంప్ లో హరీష్ శంకర్!

హరీష్ శంకర్-దిల్ రాజు బంధం ఏనాటిదో. వాళ్లది సక్సెస్ ఫుల్ కాంబినేషన్ కూడా. మళ్లీ ఆ కాంబినేషన్ నే సెట్ అయ్యేలా కనిపిస్తోంది. మైత్రీ సంస్థలో చిరకాలంగా వుండిపోయారు హరీష్ శంకర్. వాళ్లతో సినిమా…

హరీష్ శంకర్-దిల్ రాజు బంధం ఏనాటిదో. వాళ్లది సక్సెస్ ఫుల్ కాంబినేషన్ కూడా. మళ్లీ ఆ కాంబినేషన్ నే సెట్ అయ్యేలా కనిపిస్తోంది. మైత్రీ సంస్థలో చిరకాలంగా వుండిపోయారు హరీష్ శంకర్. వాళ్లతో సినిమా మెటీరియలైజ్ కాకపోయినా, అనుబంధం బాగానే వున్నా, వేరే కారణాల వల్ల సినిమా చేయడం కుదరడం లేదు. మైత్రీ-హరీష్ శంకర్ సినిమాకు ఓ పెద్ద దర్శకుడు సైంధవుడి మాదిరిగా అడ్డంగా కూర్చుని వున్నాడు. ఆ దర్శకుడిని లేపడం వీళ్ల తరం కావడం లేదు.

అందుకే దర్శకుడు హరీష్ నే మైత్రీ నుంచి తన క్యాంప్ ను దిల్ రాజు దగ్గరకు మారుస్తున్నారన్న గ్యాసిప్ వినిపిస్తోంది. ఎందుకంటే హీరో విజయ్ దేవర కొండ డేట్ లు దిల్ రాజు దగ్గర వున్నాయి. అవి ఎప్పుడో లాంగ్ బ్యాక్ ఫిక్స్ అయిన ఓ సినిమా కోసం ఇచ్చిన డేట్ లు. దిల్ రాజు తలుచుకుంటే విజయ్-హరీష్ శంకర్ సినిమా పాజిబుల్ అవుతుంది. అందుకే హరీష్ ఇప్పుడు దిల్ రాజు వైపు చూస్తున్నారని తెలుస్తోంది.

నిజానికి ఆ డేట్ లు విజయ్-ఇంద్రగంటి కాంబినేషన్ లో సినిమా చేయడం కోసం అలా వుంచారు. ఇంద్రగంటి దగ్గర ఓ భారీ అంటే భారీ కథ వుంది. మరి దాన్ని పక్కన పెట్టి హరీష్ తో సెట్ చేస్తారేమో సినిమా?

సక్సెస్ లు, బ్లాక్ బస్టర్లు ఇచ్చినా తన కెరీర్ సక్రమంగా సాగడం లేదని, ఇకపై తన సినిమాల ప్లానింగ్ ను తనే చూస్తే బెటర్ అని దిల్ రాజుకే అప్పచెప్పే ఆలోచనను హరీష్ వెలిబుచ్చారని వార్తలు వినిపిస్తున్నాయి. పోనీ ఆ విధంగానైనా ఓ మంచి కమర్షియల్ డైరక్టర్ చకచకా సినిమాలు చేయడానికి వీలు అవుతుందేమో?