జగ్గా రెడ్డి సంచలన నిర్ణయం!

కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్, సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డి వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌న‌ని సంచాల‌న వ్యాఖ్య‌లు చేశారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో సంగారెడ్డి టికెట్ కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌కే ఇప్పిస్తాన‌ని, ఒక వేళ ఎవ‌రూ…

కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్, సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డి వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌న‌ని సంచాల‌న వ్యాఖ్య‌లు చేశారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో సంగారెడ్డి టికెట్ కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌కే ఇప్పిస్తాన‌ని, ఒక వేళ ఎవ‌రూ ముందుకు రాక‌పోతే త‌న భార్య నిర్మ‌ల‌ను ఎన్నిక‌ల బ‌రిలో నిలుపుతాన‌ని తెలిపారు. 

రాజ‌కీయ వ్యూహంలో భాగంగా ఈ సారి పోటీకి దూరంగా ఉండి మ‌ళ్ళీ 2028 ఎన్నిక‌ల్లో పోటీ చేస్తాన‌న్నారు. త‌న‌పై ఎవ‌రి వ‌త్తిడి లేద‌ని ఒక ట‌ర్మ్ మాత్రం ఎల‌క్ష‌న్స్ లో పోటీ చేయ‌కుండా దూరంగా ఉంబోతున్న‌ట్లు తెలిపారు. ఎందుకు దూరంగా ఉంటున్నానో త‌ర్వాత అంద‌రికీ తెలుస్తుంద‌న్నారు. ఉన్నట్టుండి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని ఎమ్మెల్యే జగ్గారెడ్డి చెప్పడంపై రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. 

పీసీసీ అధ్య‌క్షుడి రేవంత్ రెడ్డితో విభేదాలు కార‌ణంగా సొంత పార్టీ పైనే కొన్ని సార్లు విమ‌ర్శ‌లు చేసి అధిష్టానంకు సంజాయిషీ ఇచ్చుకోనే వ‌ర‌కు తెచ్చుకున‌న్నారు. కాంగ్రెస్ అధిష్టానం చెప్పడంతో గ‌త కొంత కాలంగా విమ‌ర్శ‌ల‌కు దూరంగా ఉంటూ వ‌స్తున్నారు. రేవంత్, కోమ‌టి రెడ్డి బ్ర‌ద‌ర్స్ ఇష్యూలో కూడా ఎక్క‌డ నోరు మెద‌ప‌లేదు. ఉన్న‌ట్లుండి ఇవాళ త‌ను పోటీకి దూరంగా ఉంటున్న‌ట్లు సంచాల‌న వ్యాఖ్య‌లు చేశారు.

ఇవాళ త‌మిళ‌నాడు ద‌గ్గ‌ర రాహుల్ గాంధీ మొద‌లు పెడుతున్న‌ భారత్ జోడో యాత్రకు కూడా వెళ్ల‌లేదు. కానీ రేప‌టి నుండి యాత్ర‌కు సంకీభవంగా సంగారెడ్డి నియోజ‌క‌వ‌ర్గంలో ర్యాలీలు చేయ‌బోతున్న‌ట్లు చెప్పారు. జ‌గ్గా రెడ్డి మాట‌లు బట్టి చూస్తుంటే కాంగ్రెస్ ను వ‌దిలి సొంత‌ కుంప‌టి, లేదా టీఆర్ఎస్ లో జాయిన్ అవ్వ‌బోతున్న‌ట్లు రాజ‌కీయ వ‌ర్గాలల్లో చ‌ర్చ జ‌రుగుతోంది.