పాపం ప్రణీత.. బాలీవుడ్ కలలు చెల్లాచెదురు

ఎన్నో ఆశలు పెట్టుకుంది. కచ్చితంగా హిట్ అవుతుందని నమ్మింది. కానీ ప్రణీత కలలు చెదిరాయి. ఆమె బాలీవుడ్ డెబ్యూ ఫ్లాప్ తో మొదలైంది. హంగామా-2 సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. డిస్నీ హాట్ స్టార్…

ఎన్నో ఆశలు పెట్టుకుంది. కచ్చితంగా హిట్ అవుతుందని నమ్మింది. కానీ ప్రణీత కలలు చెదిరాయి. ఆమె బాలీవుడ్ డెబ్యూ ఫ్లాప్ తో మొదలైంది. హంగామా-2 సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. డిస్నీ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కొచ్చిన ఈ సినిమా ప్రణీత బాలీవుడ్ కెరీర్ కు ఏమాత్రం పనికిరాదు.

దర్శకుడు ప్రియదర్శన్, సీనియర్ నటి శిల్పాషెట్టికి ఇది కమ్ బ్యాక్ సినిమా. లాంగ్ గ్యాప్ తర్వాత వీళ్లిద్దరూ కలిసి హంగామా-2 చేశారు. శిల్పాషెట్టి అయితే ఏకంగా 14 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత సిల్వర్ స్క్రీన్ పైకొచ్చింది. ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కలిసి హంగామా-2కు మంచి మైలేజీ తెచ్చి పెడతాయని ప్రణీత భావించింది. కానీ అలా జరగలేదు.

సినిమాలో కంటెంట్ చెత్తగా ఉంది. ఈ ఏడాది చెత్త సినిమాల్లో ఒకటిగా నిలవడం ఖాయం. కనీసం నటీనటుల పెర్ఫార్మెన్సులు కూడా బాగాలేవు. చివరికి ప్రణీత కూడా ఆకట్టుకోలేకపోయింది. బాధాకరమైన విషయం ఏంటంటే.. కొన్ని బాలీవుడ్ సైట్స్, ఈమెలో బాలీవుడ్ కు సరిపడేంత స్టఫ్ లేదని తేల్చేశాయి.

ఇలా ఓ ఫ్లాప్ సినిమాతో తన బాలీవుడ్ కెరీర్ ప్రారంభించింది ప్రణీత. పెళ్లి తర్వాత రిలీజైన తన తొలి హిందీ సినిమా హిట్టయితే బాగుండేది. ఓ మంచి మెమొరీగా ఉండేది. కానీ ప్రణీతకు ఆ ఆనందం దక్కకుండా చేసింది హంగామా-2.