నిజమైన ప్రతిపక్ష నేత ఆయనేనా…?

ప్రతిపక్షం అంటే మంచిని మంచిగా చెడుని చెడుగా చూడాలి. తమ కళ్ళకు ఉన్న రాజకీయపు కళ్ళద్దాలు తీసేసి పూర్తి పారదర్శకంగా చూడాలి. ఇంకా చెప్పాలీ అంటే ప్రజాపక్షం నుంచి చూడాలి. అపుడు అన్నీ చాలా…

ప్రతిపక్షం అంటే మంచిని మంచిగా చెడుని చెడుగా చూడాలి. తమ కళ్ళకు ఉన్న రాజకీయపు కళ్ళద్దాలు తీసేసి పూర్తి పారదర్శకంగా చూడాలి. ఇంకా చెప్పాలీ అంటే ప్రజాపక్షం నుంచి చూడాలి. అపుడు అన్నీ చాలా జాగ్రత్తగా కనిపిస్తాయి.

ఏపీలో జగన్ సర్కార్ ఏ ఒక్క మంచి పనీ చేయలేదని, మొత్తానికి మొత్తం విద్వంశమే అని తెల్లారిలేస్తే టీడీపీ సహా ఇతర విపక్షాలు గొంతు చించుకుంటాయి. కానీ మూడేళ్ల కాలంలో వైసీపీ సర్కార్ చేసిన మంచి పనులు కూడా చాలానే ఉన్నాయి.

ముఖ్యంగా విద్యా రంగానికి గతంలో ఏ ప్రభుత్వం పెట్టనంత ఖర్చు బడ్జెట్ లో ఈ ప్రభుత్వం పెడుతోంది. 53 వేల కోట్లను ఇప్పటిదాకా విద్యా శాఖకు వెచ్చించిన సర్కార్ ఇది. అదే విధంగా నాడు నేడు పేరిట బడులను ఆధునీకరించడమే కాదు ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టి క్వాలిటీ ఎడ్యుకేషన్ని ఇవ్వడం బోధన విషయంలో పూర్తి శ్రద్ధాసక్తులు పెట్టడం ఇవన్నీ మంచి పనులుగానే న్యూట్రల్ జనాలు చూస్తారు.

ఇక వైద్య ఆరోగ్య రంగంలో కూడా నాడు నేడు పేరిట అభివృద్ధి చేయడం, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తో ఇంటికే డాక్టర్లను తీసువచ్చేలా చేయడం, ఆరోగ్యశ్రీ వంటి వాటి ద్వారా  ఏపీలో ఫ్రీ డయాగ్నోస్టిక్‌ సేవలను అందించడం వంటివెన్నో ఉన్నాయి.

మరి వీటి గురించి చెప్పాలంటే నిర్మాణాత్మకంగా ఆలోచించే విపక్షం లేదు అన్నదే అందరి బాధ. కానీ లోక్ సత్తా అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ్ మాత్రం జగన్ ఏలుబడిలో విద్యా వైద్య రంగాలు గణనీయమైన మార్పులను తీసుకొచ్చారని మెచ్చుకోవడం నిజంగా గొప్ప విషయంగా చూడాలి. ప్రభుత్వం చేపడుతున్న నాడు నేడు కార్యక్రమాల ద్వారా ఆ రెండు రంగాలకు ఎంతో మేలు జరుగుతోందని ఆయన పేర్కొన్నారు.

ఏపీ విద్యార్ధులు ఉత్తమైన విద్యా ప్రమాణాలు పెంచాలని ప్రభుత్వం చేస్తున్న కృషి ఎన్నతగినది అని జేపీ కొనియాడారు. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ద్వారా పట్టణాలకు జనాలు పోకుండా పల్లెలలోనే వైద్యం ఇంటికే అందుబాటులోకి తెచ్చే కార్యక్రమం జరుగుతోందని ఆయన చెప్పుకొచ్చారు.  కేవలం ఆరోగ్యశ్రీ మీద ఎక్కువ డబ్బుని ఖర్చు చేస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీ మాత్రమే అని జేపీ లాంటి మేధావి, రాజకీయాల్లో మార్పుని కోరుకునే వారు అనడం అంటే ఇంతకంటే పెద్ద ప్రశంస ఈ ప్రభుత్వానికి ఉండదేమో.