అలవైకుంఠపురములో సినిమాతో ఎంత టాప్ పొజిషన్ కు చేరుకున్నాడో, ఇప్పుడు అంత నెగిటివిటీని పోగుచెసుకుంటున్నారు సంగీత దర్ళకుడు థమన్. ఆయన బిజీ షెడ్యూలు వల్ల కావచ్చు. మరే ఇతర కారణాల వల్ల కావచ్చు టైమ్ అన్నది అస్సలు మెయింటెయిన్ చేయడం లేదని, దర్శకులను నిర్మాతలను చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారని టాలీవుడ్ లో తెగ చెప్పుకుంటున్నారు.
ముఖ్యంగా చిరంజీవి గాడ్ ఫాదర్ విషయంలో థమన్ వల్ల యూనిట్ చాలా ఇబ్బంది పడుతోందని వార్తలు వినిపిస్తున్నాయి. సల్మాన్-చిరు కాంబినేషన్ సాంగ్ ఇవ్వడానికే థమన్ చుక్కలు చూపించేసారని అంటున్నారు. మొన్నటికి మొన్న గాడ్ ఫాదర్ టీజర్ వర్క్ ను లాస్ట్ మినిట్ ఫినిష్ చేసారట. మెగాస్టార్ అది చూసి, ఇది వరుణ్ తేజ్ గని మ్యూజిక్ లా వుంది కనా అని అనే వేళకే టీజర్ విడుదలయిపోయిందని కామెంట్లు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో కూడా మెగా ఫ్యాన్స్ అదే గోల పెట్టారు.
బాలయ్య – గోపీచంద్ మలినేని సినిమా కు కూడా థమన్ పాట కోసం రెండురోజులు వెయిట్ చేయాల్సి వచ్చిందని మరో టాక్ వినిపిస్తోంది. మొన్నటికి మొన్న శివకార్తికేయన్ సినిమా ప్రిన్స్ కోసం థమన్ ఇచ్చిన పాట కూడా చాలా పాతకాలం నాటిదిలా వుందని కామెంట్లు వచ్చాయి.
ఇలా ఎందుకు జరుగుతోందో? వీటిలో నిజమెంతో? కాదో? థమన్ ఆలోచించాలి. రెక్టిఫై చేసుకోవాలి. ఇప్పటికే త్రివిక్రమ్ అడ్డం పడకపోయి వుంటే మహేష్ సినిమా థమన్ కు వచ్చి వుండేది కాదని టాక్ వుండనే వుంది. అందువల్ల థమన్ త్వరగా సెట్ చేసుకోవడం అవసరం.