జులై, ఆగస్ట్‌లో పలు మీడియం బడ్జెట్ చిత్రాలతో పాటు సాహో కూడా రిలీజ్‌కి రెడీగా వుండడంతో కొన్ని సినిమాలకి ఏదో ఒక చిత్రంతో క్లాష్ పెట్టుకోక తప్పడం లేదు. ఇస్మార్ట్ శంకర్, డియర్ కామ్రేడ్ లాంటి మిగతా సినిమాలని వదిలేసి శర్వానంద్ 'రణరంగం'తో పోటీకి దిగుతున్నారు. బెల్లంకొండ శ్రీనివాస్ 'రాక్షసుడు' జులై 18 నుంచి వాయిదా పడి ఆగస్ట్ 2న 'రణరంగం'తో రిలీజ్‌కి రెడీ అవుతోంది.
కొత్తగా 'గుణ 369' రిలీజ్ కూడా అదే డేట్‌కి ఫిక్స్ అయింది. 'ఆర్‌ఎక్స్ 100' హీరో కార్తికేయ నటిస్తున్న ఈ చిత్రం కూడా 'రణరంగం'తో పోటీకి దిగుతోంది. గతంలో శర్వానంద్ సినిమాలని పెద్ద హీరోల సినిమాలతో పోటీగా విడుదల చేసేవారు. ఎక్స్‌ప్రెస్ రాజా, శతమానంభవతి, మహానుభావుడు చిత్రాలతో భారీ సినిమాలకి ఎదురెళ్లి మరీ శర్వానంద్ విజయం సాధించాడు.
ఇప్పుడు శర్వానంద్‌కి వేరే సినిమాలతో పోటీ తప్పడంలేదు. ప్రకటించిన సినిమాలలో రేంజ్ పరంగా 'రణరంగం' పెద్దది అయినప్పటికీ ఒక్కోసారి బహుముఖ పోటీ వల్ల ఎలాంటి సినిమాకి అయినా ముప్పు తప్పదు. అసలే వారానికో సినిమా రిలీజ్ వున్న టైమ్‌లో ఇన్ని చిత్రాలతో పోటీని శర్వానంద్ ఎలా నెగ్గుకొస్తాడనేది చూడాలి.