Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

చిరంజీవి వల్ల అయ్యే పనేనా?

చిరంజీవి వల్ల అయ్యే పనేనా?

బాహుబలి విజయంతో స్ఫూర్తి పొంది 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' కథని భారీ లెవల్లో లాంఛ్‌ చేసారు. చిరంజీవి చిత్రానికి వంద కోట్ల వరకు గ్యారెంటీ మార్కెట్‌ వుంటుంది కానీ రెండు వందల కోట్లకి పైగా పెట్టుబడి రాబట్టాలంటే తెలుగేతర మార్కెట్లలోను రాణించక తప్పదు. బాహుబలి తర్వాత తెలుగు చిత్రాలకి ఇతర భాషల్లో పెరిగిన ఆదరణ నేపథ్యంలో రిస్క్‌ చేసారు.

అయితే బాహుబలి మాదిరిగా ఇతర భాషల వారి దృష్టిని ఆకర్షించడంలో సైరా ఇంతవరకు సక్సెస్‌ కాలేదు. రిలీజ్‌ చేసిన టీజర్‌లో కూడా ప్రత్యేకతలు కాకుండా రాజమౌళి షాట్స్‌ కనిపించడంతో మెగా అభిమానులు కూడా దీనిపై భారీగా నమ్మకాలు పెట్టుకోవడం లేదు. అక్టోబర్‌ 2న విడుదల చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో సైరాపై బజ్‌ పెంచడం ఎలా అనే దానిపై నిర్మాత చరణ్‌ మల్లగుల్లాలు పడుతున్నాడు.

భారీ చిత్రాలకి ప్రీరిలీజ్‌ బజ్‌ ఎంతగా వుంటే అంతగా బెనిఫిట్‌ అవుతుంది. హైప్‌ వల్ల ఓపెనింగ్స్‌ బాగా రావడమే కాకుండా సినిమాకి టాక్‌ కూడా బాగా వచ్చినట్టయితే వసూళ్ల ఉధృతికి అది తోడ్పడుతుంది. ఇంత స్కేల్‌లో తీసిన సినిమాలకి ప్రమోషన్లలోనే విజయం దాగి వుంటుంది. ప్రోమోలు ఆకర్షించలేక సరయిన అంచనాలు ఏర్పడకపోతే 2.0 మాదిరిగా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. 

ముద్దు ముద్దు మాటలతో దొరసాని.. ఏమి చెప్పిందంటే

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?