cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

పవన్‌కళ్యాణ్‌ని వెంటాడుతోన్న సినీభూతం!

పవన్‌కళ్యాణ్‌ని వెంటాడుతోన్న సినీభూతం!

పవన్‌కళ్యాణ్‌ తనని తాను సీరియస్‌ పొలిటీషియన్‌గా చూపించుకోవాలని చాలా ట్రై చేస్తున్నాడు. అయితే అతను ఏమి చేసినా కానీ సినిమా ఇమేజ్‌ అతడిని వెంటాడుతూనే వుంది. ముఖ్యంగా మీడియా పవన్‌కళ్యాణ్‌ ఏమి చేసినా దానిని మరో కోణంలో చూపించే ప్రయత్నం చేస్తోంది. ఆమధ్య గ్లామర్‌ లేకుండా గడ్డంతో సాదాసీదాగా కనిపించాలని పవన్‌ ట్రై చేస్తే 'బాబా' అంటూ సెటైర్లు పడ్డాయి.

తర్వాత కాస్త గడ్డం ట్రిమ్‌ చేస్తే ఇప్పుడు గ్లామర్‌ అవసరం ఏమి వచ్చిందనే కామెంట్లు కూడా అదే మీడియా చేసింది. తాజాగా టీషర్ట్‌ వేసుకుని కనిపిస్తే సినిమాలకి సిద్ధమవుతున్నాడని ప్రచారం చేస్తోంది. పవన్‌ ఎలా ట్రై చేసినా కానీ అతని సినీ గ్లామర్‌ అయితే భూతంలా వెంటాడుతోంది. అసలే గత ఎన్నికలలో ఊహించిన దాని కంటే ఘోరమైన వైఫల్యం చెందడంతో తన పార్టీకి ఒక ఐడెంటిటీ ఎలా తేవాలా అంటూ పవన్‌ సతమతమవుతున్నాడు.

కానీ మీడియా మాత్రం అతడిని సినీ హీరోని దాటి చూపించడానికి ససేమీరా అంటోంది. ఇలా ఎంతకాలం పవన్‌ని మీడియా ర్యాగింగ్‌ చేస్తుందో కానీ తనని సీరియస్‌గా తీసుకోవడానికి పవన్‌ ఏదైనా గట్టి ప్రణాళికతో దిగక తప్పదు. లేదంటే అతడి ప్రతి చర్యకీ సినీ మేకప్‌ వేస్తుంటే భరించక తప్పదు. 

ముద్దు ముద్దు మాటలతో దొరసాని.. ఏమి చెప్పిందంటే