Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఈ సినిమాను బ్రోచేవారెవరరు?

ఈ సినిమాను బ్రోచేవారెవరరు?

బ్రోచేవారెవరురా.. రీసెంట్ గా హిట్ అయిన సినిమా. మార్కెట్లో ఇలాంటి ఓ హిట్ సినిమా పడితే అది హాట్ కేక్. అన్ని రకాల రైట్స్ అమ్ముడుపోతాయి. కానీ బ్రోచేవారెవరురా సినిమాకు సంబంధించి మాత్రం ఇంకా శాటిలైట్ డీల్ పూర్తవ్వలేదు. దీనికి కారణం మేకర్స్ అత్యాశ.

శ్రీవిష్ణు కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన ఈ సినిమాను విడుదలకు ముందు కొనేందుకు ఏ ఒక్కరూ ఆసక్తి కనబరచలేదు. దీనికి కారణం హీరో ట్రాక్ రికార్డు. అతడు నటించిన గత సినిమాలు ఎన్నో శాటిలైట్ కు నోచుకోక కుప్పలుతెప్పలుగా పడున్నాయి. అయితే ఎప్పుడైతే "బ్రోచే.." హిట్ అయిందో, ఛానెల్స్ అన్నీ రైట్స్ తీసుకునేందుకు ఇంట్రెస్ట్ చూపించాయి. సరిగ్గా ఇక్కడే మేకర్స్ కు ఆశ ఎక్కువైంది.

ఓ ఛానెల్ తో డీల్ దాదాపు పూర్తయిందనుకున్న టైమ్ లో మరో 50 లక్షలు ఎక్కువ వస్తున్నాయనే కారణంతో ఓ థర్డ్ పార్టీ సంస్థకు సినిమా శాటిలైట్ రైట్స్ అమ్మేశారు. అయితే అక్కడ కూడా లావాదేవీల విషయంలో తేడాలు రావడంతో ఇప్పుడు లాక్కోలేక పీక్కోలేక ఇబ్బంది పడుతున్నారు.

ప్రస్తుతానికైతే ఈ సినిమా గురించి ఛానెల్స్ పట్టించుకోవడం మానేశాయి. అటు థర్డ్ పార్టీ కూడా హ్యాండ్ ఇచ్చే స్థితికి వచ్చేసింది. సో.. ఇప్పుడు మళ్లీ ఛానెల్స్ వద్దకే రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. తప్పనిసరి పరిస్థితుల మధ్య ఛానెల్స్ చెప్పిన ఎమౌంట్ కే డీల్ సెట్ చేసుకోవాలి. లేదంటే శ్రీవిష్ణు గత సినిమాల్లా ఇది కూడా శాటిలైట్ కు నోచుకోదు. 

ముద్దు ముద్దు మాటలతో దొరసాని.. ఏమి చెప్పిందంటే

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?