cloudfront

Advertisement


Home > Movies - Movie Gossip

సినిమా ఆలస్యంపై అఖిల్ అసంతృప్తి?

సినిమా ఆలస్యంపై అఖిల్ అసంతృప్తి?

గీతాఆర్ట్స్ నిర్మించే అఖిల్ సినిమా వ్యవహారం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు వుండిపోయింది. హడావుడిగా పూజ అయితే చేసారు తప్ప, అక్కడి నుంచి అంగుళం ముందుకు జరగలేదు. ఈ విషయంలో హీరో అఖిల్ తీవ్ర అసంతృప్తితో వున్నట్లు తెలుస్తోంది. వేరే విషయాల్లో కూడా అఖిల్ గీతా సంస్థ తీరుపై అసంతృప్తితో వున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఇప్పటి వరకు ఈ సినిమాకు హీరోయిన్ ను ఎంపిక చేయలేదు. పోనీ హీరోయిన్ అంటే దొరకాలి. కొత్త అమ్మాయి లేదా కాస్త నోటెడ్ ఫేస్. డేట్ లు ఇలా చాలా వ్యవహారాలు వుంటాయి. పైగా రెమ్యూనిరేషన్ కాస్త ఎక్కువ అయితే గీతా సంస్థ అంత సులువుగా ఓకె చేయదు. ఇలా బోలెడు లెక్కలు వుంటాయి.

కానీ సినిమాటోగ్రాఫర్ ను కూడా ఇప్పటి వరకు ఈ సినిమాకు ఫిక్స్ చేయలేదని తెలుస్తోంది. సినిమాటోగ్రాఫర్ ను ఎందుకు ఫిక్ చేయలేదో అన్నది రీజన్ తెలియడం లేదు. రెండు మూడు పేర్లు పరిశీలనలో వున్నాయని, దర్శకుడు భాస్కర్ కు, నిర్మాత బన్నీ వాస్ కు ఈ విషయంలో ఏకాభిప్రాయం కుదరాల్సి వుంది.

గీతాసంస్థ సాయిధరమ్ తేజ్ తో నిర్మిస్తున్న సినిమా షూట్ మాత్రం చకచకా జరుగుతోంది. దర్శకుడు మారుతి ఈ విషయంలో స్పీడ్ గా వున్నారు. కానీ అఖిల్ తో సినిమా మాత్రం ఓపెనింగ్ తో ఆగింది. ఈ సినిమా చాలావరకు పూర్తయితే తప్ప అఖిల్ సినిమా పట్టాలు ఎక్కదు అన్న గ్యాసిప్ లు వినిపిస్తున్నాయి. ఈ లెక్కన చూస్తుంటే ఈ ఏడాదిలో అఖిల్ సినిమా విడుదల వుండదేమో?

ముద్దు ముద్దు మాటలతో దొరసాని.. ఏమి చెప్పిందంటే