బిగ్‌బాస్ హౌస్‌లో వింత జంతువులు!

బిగ్‌బాస్ రియాల్టీ షోపై సీపీఐ జాతీయ కార్య‌ద‌ర్శి కె.నారాయ‌ణ ఆగ్ర‌హం చ‌ల్లార‌లేదు. బిగ్‌బాస్ రియాల్టీ షో సీజ‌న్‌-6 ఆదివారం అంగ‌రంగ వైభ‌వంగా మొద‌లైంది. ఈ నేప‌థ్యంలో షోపై మ‌రోసారి నారాయ‌ణ తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు.  Advertisement…

బిగ్‌బాస్ రియాల్టీ షోపై సీపీఐ జాతీయ కార్య‌ద‌ర్శి కె.నారాయ‌ణ ఆగ్ర‌హం చ‌ల్లార‌లేదు. బిగ్‌బాస్ రియాల్టీ షో సీజ‌న్‌-6 ఆదివారం అంగ‌రంగ వైభ‌వంగా మొద‌లైంది. ఈ నేప‌థ్యంలో షోపై మ‌రోసారి నారాయ‌ణ తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. 

గ‌తంలో బిగ్‌బాస్ హౌస్‌ను బ్రోత‌ల్ హౌస్‌గా అభివ‌ర్ణించిన సంగ‌తి తెలిసిందే. ఈ షోను బ్యాన్ చేయాలంటూ ఆయ‌న న్యాయ‌పోరాటం చేసినా, ఫ‌లితం ద‌క్క‌లేదు.

తాజాగా మ‌రోసారి షోపై తీవ్ర అభ్యంత‌ర‌క‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న ఏమ‌న్నారంటే…

'కాసులకు కక్కుర్తి పడేవాళ్లున్నంత కాలం ఇలాంటి షోలు ఉంటాయి. బిగ్‌బాస్‌ షోతో ఏం సందేశం ఇస్తున్నారో ప్రేక్షకులు ప్రశ్నించాలి. బిగ్‌బాస్‌ షోను బూతుల స్వర్గంగా మారుస్తారా? అదొక అనైతిక షో. ఈ హౌస్‌లోకి వింత జంతువులు వెళ్లాయి' అంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఒక హౌస్‌లో అమ్మాయిలు, అబ్బాయిలు వంద రోజుల పాటు ఉండ‌డాన్ని ఆయ‌న జీర్ణించుకోలేక‌పోతున్నారు.

నారాయ‌ణ కామెంట్స్‌పై భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. కొంద‌రు ఆయ‌న్ని స‌మ‌ర్థిస్తుండ‌గా, మ‌రికొంద‌రు తీవ్రంగా త‌ప్పు ప‌డుతున్నారు. ఇష్టంలేద‌ని నోటికొచ్చిన‌ట్టు మాట్లాడ్డం ఏం ప‌ద్ధ‌త‌ని నిల‌దీస్తున్నారు. నారాయ‌ణ కామెంట్స్ సంస్కార ర‌హితంగా ఉన్నాయ‌నే అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి. 

షోను వ్య‌తిరేకించ‌డానికి, దూషించ‌డానికి తేడా వుంటుంద‌ని హిత‌వు చెబుతున్నారు. క‌మ్యూనిస్టు పార్టీకి జాతీయ నాయ‌కుడిగా చెలామ‌ణి అవుతున్న నాయ‌కుడి నోట అభ్యంత‌ర‌క‌ర వ్యాఖ్య‌లు రావ‌డం విచార‌క‌ర‌మ‌ని అంటున్నారు.