ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై తన అక్కసును టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఏ మాత్రం దాచుకోలేదు. బహిరంగం గానే ప్రదర్శిస్తున్నారు. జగన్‌పై తన మనసులో మాటను ఎప్పటికప్పుడు లోకేశ్ బయటపెడుతూ టీడీపీ శ్రేణుల్ని ఉత్సాహ పరుస్తున్నారు.
ఏకంగా జగన్‌ను నడిరోడ్డు మీద ఉరి తియ్యాలా? అని లోకేశ్ ప్రశ్నిస్తుండడం గమనార్హం. విశాఖలో నాయుడు అనే ఉపాధ్యాయుడి సస్పెన్షన్. జగన్‌పై కోపం తెప్పించింది.
విశాఖ జిల్లా నాతవరం మండలం ఉప్పరగూడెం ప్రాథమిక పాఠశాల ఎస్జీటీ ఎస్.నాయుడు సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓ పోస్ట్ పెట్టాడు. దీంతో ఆయన్ని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. నాయుడి సస్పెన్షన్‌ను లోకేశ్ సీరియస్‌గా తీసుకున్నారు. ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నట్టు లోకేశ్ తెలిపారు.
సోషల్ మీడియాలో ఎవరో పంపిన మెసేజ్‌ని ఫార్వార్డ్ చేస్తేనే ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేస్తే…విద్యాబుద్ధులు నేర్పే గురువులకు తన చీప్ లిక్కర్ అమ్మే మద్యం దుకాణాల ముందు డ్యూటీవేసిన జగన్ రెడ్డిని ఏం చేయాలని లోకేశ్ నిలదీశారు.
నడిరోడ్డు మీద ఉరి తియ్యాలా అని లోకేశ్ ప్రశ్నించడం గమనార్హం. సర్వీస్ రూల్స్‌కి విరుద్ధంగా వ్యవహరిస్తూ వైసీపీ ప్రభుత్వం భావవ్యక్తీకరణ స్వేచ్చను హరిస్తోందని మండిపడ్డారు.