బాబు వ‌ద్దు.. ఎన్టీఆర్ ముద్దు!

అమిత్ షా- ఎన్టీఆర్ భేటి ఇప్ప‌ట్లో తెలుగు రాష్ట్రాల బీజేపీ నేత‌లు వ‌దిలేలాగా క‌న‌ప‌డ‌ట‌లేదు. ఒక వైపు రాజ‌కీయ భేటీ కాదంటూనే రోజుకు ఒక సారి ఎన్టీఆర్ గురించి మాట్లాడుతున్నారు బీజేపీ నేతలు. తాజాగా…

అమిత్ షా- ఎన్టీఆర్ భేటి ఇప్ప‌ట్లో తెలుగు రాష్ట్రాల బీజేపీ నేత‌లు వ‌దిలేలాగా క‌న‌ప‌డ‌ట‌లేదు. ఒక వైపు రాజ‌కీయ భేటీ కాదంటూనే రోజుకు ఒక సారి ఎన్టీఆర్ గురించి మాట్లాడుతున్నారు బీజేపీ నేతలు. తాజాగా ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు జూనియ‌ర్ ఎన్టీఆర్ విష‌యంలో ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. సోము వీర్రాజు మాట‌లు చూస్తుంటే చంద్ర‌బాబు వ‌ద్దు.. ఎన్టీఆర్ ముద్దు అన్న‌ట్లు క‌న‌ప‌డుతోంది.

సోము వీర్రాజు ఇవాళ‌ మీడియాతో మాట్లాడుతూ ఆవ‌స‌రం అయితే ఎన్టీఆర్ సేవ‌ల‌ను రాజకీయ‌ల‌ల్లో ఉప‌యోగించుకుంటామన్నారు. చంద్ర‌బాబుపై బీజేపీ వైఖ‌రిలో ఎలాంటి మార్పు లేద‌ని, చంద్ర‌బాబు కంటే ఎన్టీఆర్ కు ప్ర‌జాద‌ర‌ణ ఎక్కువ అని, ఎన్టీఆర్ సేవ‌ల‌ను త‌మ‌కు ఎక్క‌డ‌ అవ‌స‌ర‌మే అక్క‌డ ఉప‌యోగించుకుంటామ‌న్నారు. ఫ్యామిలీ పార్టీల‌ను దూర‌మ‌ని ఇంత‌కు ముందే మా పార్టీ అధిష్టానం చెప్పింద‌ని గుర్తుచేశారు.

బ‌హుశ వ‌చ్చే ఎన్నిక‌ల ముందే త‌మతో పొత్తు ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ను పక్క‌కు పెట్టి ఎన్టీఆర్ ను రాజ‌కీయాల్లోకి తీసుకురాబోతున్న‌ట్లు క‌న‌ప‌డుతోంది తాజా బీజేపీ నేత‌ల మాటాలు బ‌ట్టి ఆర్ధం అవుతోంది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ను న‌మ్ముకోంటే వచ్చే ఎన్నిక‌ల్లో ఎటూవంటి ప్రయోజనం ఉండాద‌ని బీజేపీ అధిష్టానం భావిస్తున్న‌ట్లు క‌న‌ప‌డుతోంది.

ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో పొత్తు వ‌ల్ల లాభం కంటే ఎక్కువ‌గా బీజేపీ న‌ష్ట‌పోతున్న‌ట్లు గ్ర‌హించి. ఎన్టీఆర్ ను తెర‌పెకి తెస్తున్న‌ట్లు బీజేపీ నేత‌లు బావిస్తున్నారు. ప‌వ‌న్ త‌న పార్టీ కంటే టీడీపీ అధినేత బాగు కోస‌మే ప‌ని చేస్తున్నార‌ని గ్ర‌హించిన బీజేపీ అధిష్టానం ఎన్టీఆర్ తో ఇరు పార్టీల‌ను క‌ట్ట‌డి చేయ‌బోతున్న‌ట్లు క‌న‌పడుతోంది.