‘పుష్ప’ కు బ్రేక్

స్టయిలిష్ స్టార్ బన్నీ-డైరక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో తయారవుతున్న పుష్ప సినిమాకు మరోసారి అంతరాయం కలిగింది.  Advertisement డైరక్టర్ సుకుమార్ కు వైరల్ ఫీవర్ రావడంతో, గత మూడు రోజులుగా జరగాల్సిన షూట్ నిలిచిపోయిందని…

స్టయిలిష్ స్టార్ బన్నీ-డైరక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో తయారవుతున్న పుష్ప సినిమాకు మరోసారి అంతరాయం కలిగింది. 

డైరక్టర్ సుకుమార్ కు వైరల్ ఫీవర్ రావడంతో, గత మూడు రోజులుగా జరగాల్సిన షూట్ నిలిచిపోయిందని బోగట్టా. ఈ సినిమా షూటింగ్ ఆది నుంచి పడుతూ లేస్తూనే సాగుతోంది. 

ప్రారంభం నుంచి ఓ పక్క కరోనా వెంటాడుతోంది. ఆఖరికి హైదరాబాద్ లోనే సెట్ వేసి షూట్ చేస్తున్నారు.

ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు మళ్లీ చిన్న బ్రేక్ వచ్చింది. సుకుమార్ మళ్లీ హెల్త్ సెట్ అయితే షూట్ ప్రారంభం అవుతుంది. 

పుష్ప సినిమాను సింగిల్ పార్ట్ గా ప్రారంభించి ఇప్పుడు రెండు భాగాలుగా మార్చారు. తొలిభాగం 2022లో విడుదలవుతుంది. మలి భాగం 2023లో విడుదలయ్యే అవకాశం వుంది.