శర్వా-దేవీ..ఫస్ట్ కాంబో

హీరో శర్వానంద్ సినిమాకు మ్యూజిక్ డైరక్టర్ దేవీశ్రీ ప్రసాద్ పని చేస్తున్నాడు. అయితే ఏంటీ? అంటే…వుంది విషయం. శర్వానంద్ సినిమాలకు దేవీ పనిచేయడం ఇదే ఫస్ట్ టైమ్.  Advertisement చిత్రంగా ఇప్పటి వరకు శర్వానంద్…

హీరో శర్వానంద్ సినిమాకు మ్యూజిక్ డైరక్టర్ దేవీశ్రీ ప్రసాద్ పని చేస్తున్నాడు. అయితే ఏంటీ? అంటే…వుంది విషయం. శర్వానంద్ సినిమాలకు దేవీ పనిచేయడం ఇదే ఫస్ట్ టైమ్. 

చిత్రంగా ఇప్పటి వరకు శర్వానంద్ సినిమాకు ఎవరు మ్యూజిక్ డైరక్టర్ గా పనిచేసినా, పాటలు మాత్రం అన్నీ బాగానే వుంటాయి. వాటిలో భయంకరమైన హిట్ లు కూడా వున్నాయి. అందుకే ఇప్పటి వరకు దేవీ పనిచేసాడా లేదా అన్న పాయింట్ రాలేదు.

అయితే ఫస్ట్ టైమ్ ఎందుకో దేవీతో చేయాలని శర్వానంద్ గట్టిగా ఫిక్స్ అయిపోయారు. అందుకే పట్టుపట్టి మరీ దేవీశ్రీప్రసాద్ ను తీసుకునేలా చేసారు. 

గమ్మత్తేమిటంటే శర్వానంద్ చేసిన ఓ సినిమాకు దేవీశ్రీ ప్రసాద్ పని చేసాడు. కానీ ఆ సినిమాలో శర్వా హీరో కాదు. పాటలు లేవు. అదే శంకర్ దాదా ఎంబిబిఎస్. 

మళ్లీ ఇన్నాళ్లకు శర్వా సినిమాకు దేవీ పని చేస్తున్నాడు. మరి ఏ రేంజ్ పాటలు ఇస్తాడో? చూడాలి. ఆ మధ్యనే నితిన్ సినిమా రంగ్ దే కు మంచి పాటలే ఇచ్చాడు. 

పెద్ద సినిమాలకు కాకుండా మిడ్ రేంజ్ సినిమాలకు దేవీ మంచి పాటలు ఇవ్వడం అన్నది కాస్త రేర్ గా జరుగుతుంటుంది. మరి ఈసారి ఏం చేస్తాడో చూడాలి.