బాలయ్య సినిమాలో అరవింద్ స్వామి

తమిళ హీరో అరవింద్ స్వామి అంటే మన ఆడియన్స్ మొదటి నుంచీ అభిమానమే. అతగాడి సినిమాలు అన్నీ తెలుగునాట ఆదరణ పొందినవే. రోజా దగ్గర నుంచి నిన్న మొన్నటి ధృవ వరకు.  Advertisement ఇప్పుడు…

తమిళ హీరో అరవింద్ స్వామి అంటే మన ఆడియన్స్ మొదటి నుంచీ అభిమానమే. అతగాడి సినిమాలు అన్నీ తెలుగునాట ఆదరణ పొందినవే. రోజా దగ్గర నుంచి నిన్న మొన్నటి ధృవ వరకు. 

ఇప్పుడు మళ్లీ మరో సినిమాలోకి అరవింద్ స్వామి ని తీసుకురావడానికి ప్రయత్నాలు మొదలయ్యాయి. బాలయ్య-అనిల్ రావిపూడి కాంబినేషన్ లో నిర్మించే సినిమాలో ఓ కీలక పాత్రకు అరవింద్ స్వామిని తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు.

ఎటొచ్చీ తమిళ, మలయాళ నటులను తీసుకోవడం అంటే సమస్య ఒక్కటే..డేట్ లు సర్దుబాటు కావడం, అది కూడా మన హీరోల డేట్ లతో సెట్ కావడం. ఇప్పుడు అదే ప్రయత్నంలో వున్నారు. బాలయ్య ఈ సినిమాలో ఓ డిఫరెంట్ క్యారెక్టర్ చేస్తున్నారు. మాస్ యాక్షన్ క్యారెక్టర్ నే కానీ మరీ యంగ్ కాదు. అలాగే ఎమోషనల్ టచ్ వుండే పాత్ర అది.

ఈ సినిమాకు థమన్ సంగీతం అందించబోతున్నారు. కోబ్రా సినిమాకు మాంచి సినిమాటోగ్రఫీ అందించిన హరి తొలిసారి తెలుగు సినిమాగా దీనికి పని చేస్తున్నారు.