‘దేశం’ మీడియా జీర్ణించుకోలేని వార్త

జాతీయ మీడియా చిన్న నాలుగు సెంటీమీటర్లు సింగిల్ కాలమ్ వార్త వైకాపాకు వ్యతిరేకంగా వచ్చినా, ఇక ఆ రోజు అంతా తెలుగుదేశం అనుకూలం మీడియాకు పండగే. సాయంత్రం వేళ డిస్కషన్లకు రెడ్ బుల్ తాగి…

జాతీయ మీడియా చిన్న నాలుగు సెంటీమీటర్లు సింగిల్ కాలమ్ వార్త వైకాపాకు వ్యతిరేకంగా వచ్చినా, ఇక ఆ రోజు అంతా తెలుగుదేశం అనుకూలం మీడియాకు పండగే. సాయంత్రం వేళ డిస్కషన్లకు రెడ్ బుల్ తాగి మరీ రెడీ అయిపోతారు. 

యాంకర్లు కళ్లలో వెలుగులు నింపేసుకుని మురిసిపోతూ మాట్లాడతారు. సవాళ్లు విసురుతారు. తమ తమ చానెళ్ల ఆస్థాన విద్యాంసులను పిలిచి పేరంటం పెడతారు. ట్విట్టర్ అక్కౌంట్లో ఇవే ట్వీట్ లు, యూ ట్యూబ్ లో ఇవే వీడియోలు, ప్రింట్ లో ఇవే అక్షరాలు ఇలా నలువైపుల నుంచి అబద్దాన్ని నిజం చేసే ప్రయత్నాలు. కానీ ఇలా పట్టించుకోలేని, జీర్ణించుకోలేని వార్త ఒకటి వచ్చింది.

లేటెస్ట్ గా ఓ వార్త వచ్చింది సో కాల్డ్ జాతీయ మీడియాలోనే. ఆంధ్రలో క్రైం రేటు తగ్గింది అన్నది ఆ వార్త. ఎవరో గాలిపోగేసి రాసిన వార్త కాదు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో అందించిన నివేదిక ఇది. 2014-18 కన్నా, అంటే ఎవరి పాలన అన్నది ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు కదా, 2019 -2021 మధ్యలో నేషనల్ క్రైమ్ రేటు బాగా తగ్గిందన్నది ఆ నివేదిక సారాశం. 2014-18 మధ్యలో క్రైం రేటు 1077 గా నమోదు కాగా, 2014-18 కాలంలో 893 గా నమోదు అయింది.

అంతే కాదు సమీప రాష్ట్రాలు అయిన తెలంగాణ, కేరళల కన్నా మహిళల పట్ల నేరాలు బాగా తక్కువే అన్నది మరో విషయం. ఆంధ్రలో మహిళల పట్ల నేరాలు ఆంధ్రలో 67.2 శాతంగా వుంటే కేరళ, తెలంగాణల్లో 111.2 అలాగే 73.3 శాతంగా వున్నాయి.

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల యావరేజ్ తీస్తే బాబుగారి హయాంలో 365 సగటు వస్తే జగన్ హయాంలో 337 సగటుగా నమోదు అయింది. ఇలా ఒక దాంట్లో కాదు దాదాపు అన్ని విభాగాల్లో క్రైమ్ రేట్ తగ్గుముఖం పట్టింది. లేదూ అంటే గత సగటుతో సమానంగానే వుంది.

మరి ఇలాంటి పాజిటివ్ వార్తను తెలుగుదేశం అనుకూల మీడియా సహించగలదా? నిత్యం పోలీస్ రాజ్యం నడుస్తోందని అబద్దపు ప్రచారం సాగించే నోటితో ఇప్పుడు కాదని ఎలా చెప్పగలరు? అందుకే దీన్ని కప్పిపుచ్చి, ఆంధ్రలో క్రైమ్ పెరిగిపోయిందని నిస్సిగ్గుగా టముకేస్తున్నారు.