జార్ఖండ్‌లో గత కొద్ది రోజులుగా రాజకీయ ప్రకంపనలు కొనసాగుతున్నాయి. సోరెన్‌పై అనర్హత వేటు వేయాలని కోరుతూ జార్ఖండ్ గవర్నర్ రమేశ్ బైస్‌కు ఎన్నికల సంఘం (ఈసీ) అభిప్రాయాన్ని వెల్లడించడంతో జార్ఖండ్ సీఎంగా హేమంత్ సోరెన్ భవిష్యత్తుపై ఉత్కంఠ మొదలైంది.
ఎమ్మెల్యేగా అనర్హత వేటు పడే అవకాశం ఉన్న జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ అసెంబ్లీలో విశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోనున్నారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తరహాలోనే ఆయన కూడా శాసనసభలో తన బల నిరూపణకు సిద్ధమయ్యారు.
అనర్హత బెదిరింపుల మధ్య, ప్రభుత్వాన్ని బీజేపీ పడగొట్లే ప్రయత్నం చేస్తోందని సోరెన్ భావించి తన అనుకుల ఎమ్మెల్యేలను రాయ్ పూర్ కి తరలించిన సోరెన్.. ఇవాళ అసెంబ్లీ సమావేశంలో అందరిని తీసుకువచ్చి విశ్వాస పరీక్షలో నెగ్గలాని చూస్తున్నారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ మరియు కర్ణాటక వంటి రాష్ట్రాలలో సంక్షోభాన్ని సద్వినియోగం చేసుకోని ఇప్పటికే అక్కడి ప్రభుత్వాలను పడగొట్టి బీజేపీ అధికారంలోకి వచ్చినట్లే జార్ఖండ్ లో కూడా ప్రయత్నిస్తున్నారని సోరెన్ ఆరోపించారు.
81 మంది సభ్యుల ఉన్న జార్ఖండ్ అసెంబ్లీలో అధికార కూటమికి 49 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అతిపెద్ద పార్టీ అయిన జెఎంఎంకి 30 మంది ఎమ్మెల్యేలు, కాంగ్రెస్‌కు 18 మంది, రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ)కి ఒక ఎమ్మెల్యే ఉన్నారు. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీజేపీకి 26 మంది ఎమ్మెల్యేలున్నారు.41 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంటే సోరెన్ గట్టెక్కుతారు.