చిరుతో మరో సినిమా తీసి సమాధానం చెబుతాడంట?

ఆ మధ్య పీకల్లోతు కష్టాల్లో, వివాదాల్లో కూరుకుపోయినప్పుడు పూరి జగన్నాధ్ మాట్లాడినట్టు ఓ ఆడియో ఫైల్ లీక్ అయింది. లైగర్ డిజాస్టర్ అయిన తర్వాత లీక్ అయిన ఆ ఆడియో ఫైల్ లో పూరి…

ఆ మధ్య పీకల్లోతు కష్టాల్లో, వివాదాల్లో కూరుకుపోయినప్పుడు పూరి జగన్నాధ్ మాట్లాడినట్టు ఓ ఆడియో ఫైల్ లీక్ అయింది. లైగర్ డిజాస్టర్ అయిన తర్వాత లీక్ అయిన ఆ ఆడియో ఫైల్ లో పూరి జగన్నాధ్ తన ఘోష మొత్తం బయటపెట్టాడు. అందరికీ న్యాయం చేస్తానన్నాడు. ఇప్పుడు అలాంటిదే మరో లీకేజీ.

భోళాశంకర్ డిజాస్టర్ అయింది. ఈసారి అనీల్ సుంకర వాట్సాప్ పేరిట కొన్ని స్క్రీన్ షాట్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అనీల్ సుంకర చెప్పినట్టు, ఆ స్క్రీన్ షాట్స్ లో కొన్ని వ్యాఖ్యాలు ఉన్నాయి. వీటిలో ఆసక్తికరమైన మేటర్ ఏంటంటే… త్వరలోనే చిరంజీవితో అనీల్ సుంకర మరో సినిమా తీస్తాడంట.

ఇంతకీ మేటర్ ఏంటంటే..

భోళాశంకర్ డిజాస్టర్ అయింది. అనీల్ సుంకర చాలా నష్టాలు చవిచూస్తున్నాడు. ఇలాంటి టైమ్ లో రెమ్యూనరేషన్ విషయంపై చిరు, అనీల్ మధ్య ఘర్షణ వాతావరణం నెలకొందంటూ కొత్త ప్రచారం ఊపందుకుంది. ఈ మేటర్ ను సెటిల్ చేసేందుకు అనీల్ సుంకర, అమెరికా వెళ్తున్నాడని, అక్కడ కొన్ని ఆస్తులు అమ్మి, రెమ్యూరనేషన్ క్లియర్ చేయబోతున్నాడంటూ ఊహాగానాలు చెలరేగాయి.

వీటికి సమాధానం ఇచ్చినట్టుగా అనీల్ సుంకర పేరిట కొన్ని వాట్సాప్ స్క్రీన్ షాట్స్, సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఓ అభిమాని, వైరల్ అవుతున్న న్యూస్ ను అనీల్ సుంకరకు వాట్సాప్ చేయగా.. వాటిపై అనీల్ స్పందించాడు. రెమ్యూనరేష్ ఇవ్వలేదంటూ వస్తున్న కథనాల్ని అనీల్ సుంకర ఖండించాడు

అంతేకాదు.. అలాంటి కథనాల్ని పట్టించుకోవద్దంటూ ఆయన తన వాట్సాప్ చాట్ ద్వారా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాడు. చిరంజీవి చాలా మంచి వ్యక్తి అని, త్వరలోనే ఆయనతో మరో సినిమా తీయబోతున్నానని, ఆ సినిమాతో అందరికీ సమాధానం చెబుతానంటూ అనీల్ సుంకర చెప్పినట్టుగా ఓ వాట్సాప్ స్క్రీన్ షాట్ చక్కర్లు కొడుతోంది.

మరోవైపు  భోళాశంకర్ సినిమాపై అభ్యంతరకర/అసభ్యకర వ్యాఖ్యలు చేస్తున్న సోషల్ మీడియా హ్యాండిల్స్ పై ప్రొడక్షన్ కంపెనీ గురిపెట్టింది. కొన్ని హ్యాండిల్స్ ను బ్లాక్ చేయించడంతో పాటు.. సదరు సంస్థలకు లీగల్ నోటీసులు పంపించే యోచనలో ఉంది.