ప్రస్తుతం తెలంగాణ రాజకీయం మొత్తం సెప్టెంబర్ 17 గురించే నడుస్తుంది. సెప్టెంబర్ 17 కోసం బీజేపీ- టీఆర్ఎస్ గోడవ పడుతుంటే తాజాగా వీరి మధ్యలో ఎంఐఎం ఎంటర్ అయ్యింది. ఇవాళ ఎంఐఎం చీఫ్ అసదుద్దిన్ ఒవైసీ సెప్టెంబర్ 17ను జాతీయ సమైక్యతా దినోత్సవంగా నిర్వహించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు.
ఒక వైపు బీజేపీ కేంద్ర ప్రభుత్వ అద్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవం జరపాలని సన్నాహలు చేస్తుంటే మరో వైపు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజు నాటికి తెలంగాణ ప్రాంతం భారత్‌లో విలీనమై 74 సంవత్సరాలు పూర్తి చేసుకుని 75వ ఏట అడుగిడుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని.. ఆ రోజు నుంచి ఏడాది పాటు తెలంగాణ విలీన వజ్రోత్సవాలు నిర్వహించేందుకు తెలంగాణ రాష్ట్ర సర్కారు సిద్ధమవుతోంది.
తెలంగాణ మిమోచనం కోసం హిందూ- ముస్లింలు కలిసి పోరాడారని, హైదరాబాద్ సంస్థానం విలీనం కోసం ముస్లింలు కూడా పోరాటం చేశారని అందుకోసం ఆ రోజు హైదరాబాద్ లో తిరంగాయాత్ర, బైక్ ర్యాలీ` చేస్తామని ఎంఐఎం చీఫ్ అమిత్ షాకు లేఖ రాశారు. అప్పట్లో రాష్ట్ర ప్రజలపై దాడులకు తెగబడ్డ రజాకార్లు అప్పుడే పాకిస్థాన్‌కు వెళ్లిపోయారన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చి ఎనిమిది సంవత్సరాలు ఎందుకు వేడుక చేయలేదని విమర్శించారు.
ఎన్నికలు దగ్గరకు వచ్చే కొద్ది తెలంగాణ ప్రజల్లో సెంటిమెంట్ ను రెచ్చగోటి ఓట్లు దండుకోవాలని అన్నీ రాజకీయ పార్టీలను ఎదురు చుస్తున్నట్లు కనపడుతోంది. టీఆర్ఎస్- బీజేపీ రాజకీయ ఎత్తుగడలో పాపం కాంగ్రెస్ ఎటు కాకుండా పోతుంది.