దాదాపు రెండు దశాబ్దాల కిందట.. నాటి టీమిండియా క్రికెట్ జట్టు కెప్టెన్ సౌరవ్ గంగూలీ, నటి నగ్మాల మధ్యన ఎఫైర్ టాక్ ఆఫ్ ద టౌన్ అయ్యింది. గంగూలీ, నగ్మా ఎఫైర్ ను మరీ రహస్యంగా ఉంచలేదు. అప్పటికే గంగూలీకి పెళ్లి అయ్యింది. కూతురు ఉంది. అయినా నగ్మా, గంగూలీ చట్టాపట్టాలేసుకున్నారు. ఇద్దరూ కలిసి శ్రీకాళహస్తికి వచ్చి దోషనివారణ పూజలేవో చేయించుకున్నారు! అదంతా పెళ్లి ప్రయత్నమే అనుకోవాలి. అయితే.. ఆ తర్వాత తేడా వచ్చింది అది వేరే కథ.
అయితే గంగూలీ, నగ్మా ఎఫైర్ అంశం మైదానంలో కూడా చర్చ అయ్యింది. ఇండియా-ఆస్ట్రేలియాల మధ్యన 2001-02 ల సమయంలో జరిగిన టెస్టు సీరిస్ సందర్భంగా గంగూలీని ఉద్దేశించి హౌ ఈజ్ నగ్మా అంటూ టీజ్ చేశాడట అప్పటి ఆస్ట్రేలియన్ ప్లేయర్ , వికెట్ కీపర్ గిల్ క్రిస్ట్. ఇక అప్పట్లో గంగూలీ పేలవ ఫామ్ తో ఉన్నాడు. దీంతో క్రీడా పేపర్లలో.. వికెట్ల వద్ద నగ్మా ఫొటో పెడితే గంగూలీ బాగా పరుగులు చేస్తాడేమో! అంటూ కొందరు జోకులేశారు!
అలా క్రికెటర్లు సరిగా ఆడని పక్షంలో వారి గర్ల్ ఫ్రెండ్స్ గురించి చర్చ జరగడం ఇప్పటికీ కొనసాగుతూ ఉంది. విరాట్ కొహ్లీ, అనుష్క శర్మ లు తమ ప్రేమ వ్యవహారాన్ని మైదానం వరకూ తీసుకొచ్చిన రోజుల్లో ఇవి తప్పలేదు. ఆ మధ్య కొహ్లీ క్యాచ్ మిస్ చేస్తే.. గావస్కర్ తన కామెంట్రీలో అనుష్క శర్మ ప్రస్తావన తీసుకురావడం విమర్శలకు తావిచ్చింది. పెళ్లికి ముందు కూడా కొహ్లీ ప్రదర్శనకు, అనుష్క శర్మకు లింకు పెట్టారు జనాలు.
ఇక ఇదే క్రమంలో మరో హీరోయిన్ పేరు టీమిండియా క్రికెటర్ ఫెయిల్యూర్ తో చర్చలోకి వచ్చింది. కేఎల్ రాహుల్ ఆసియా కప్ లో సరిగా ఆడకపోవడంతో అతడి గర్ల్ ఫ్రెండ్ అతియా షెట్టి పేరును ప్రస్తావిస్తున్నారు నెటిజన్లు. అతడు పరుగులు చేయకపోవడానికి ఆమే కారణం అనే వారు, ప్రస్తుతం రాహుల ఫామ్ ఎలా ఉందంటే.. అది అతియా షెట్టియా సినిమా కెరీర్ లా..! అంటూ కొందరు దీర్ఘాలు తీస్తున్నారు.
రాహుల్, అతియా షెట్టిలు తమ ప్రేమ వ్యవహారంలో ఇప్పటికే పాపులర్ అయ్యారు. బాలీవుడ్ నటుడు సునీల్ షెట్టి కూతురామె. సినిమాల్లో ట్రై చేస్తోంది. అయితే రాహుల్ తో ప్రేమతో పాపులర్ అయ్యింది. ఇప్పుడు రాహుల్ ఫామ్ లో లేడు. దీంతో ఆమెను ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు!