మా టీవీలో బిగ్ బాస్ 3 సీజన్ స్టార్ట్ కు ముహుర్తం ఫిక్స్ అయింది. జూలై 21 నుంచి బిగ్ బాస్ హడావుడి స్టార్ట్ అవుతుంది. ఇప్పటికి నలభైమంది వరకు హౌస్ మేట్స్ ను ఎంపిక చేసి వుంచారు. వీరిలో నుంచి 14 మందిని ఫైనల్ చేయాల్సి వుంది. ఈ వారాంతంలో జరిగే సమావేశంలో ఫైనల్ చేస్తారని తెలుస్తోంది.
యాంకర్ శ్రీముఖి మాత్రం ఫైనల్ లిస్ట్ లో ఇప్పటికే చేరిపోయినట్లు తెలుస్తోంది. బయట ప్రచారంలో వున్నట్లు ఉప్పల్ బాలు (టిక్ టాక్), హేమచంద్ర పేర్లు అస్సలు పరిశీలనలోనే లేవని తెలుస్తోంది. మీలో ఎవరు కోటీశ్వరుడులో మాదిరిగా ప్రతివారం ఓ సినిమా సెలబ్రిటీని షోకు తీసుకురావడం ద్వారా బిగ్ బాస్ 3ని రక్తికట్టించడానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రతివారం విడుదలయ్యే సినిమాలకు చెందిన వారిని, అలాగే ప్రత్యేక అతిధులను షోకు తీసుకువచ్చి, వ్యూవర్ షిప్ పెంచే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. బిగ్ బాస్ హడావుడి 100 రోజుల పాటు వుంటుంది. అంటే దాదాపు నవంబర్ ఆఖరు వరకు బిగ్ బాస్ 3 ప్రసారం వుంటుందన్నమాట.