cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

'ఇస్మార్ట్' నాన్ థియేటర్ 14 కోట్లు?

'ఇస్మార్ట్' నాన్ థియేటర్ 14 కోట్లు?

ఇస్మార్ట్ శంకర్.. హీరో రామ్-పూరి జగన్నాధ్ ల కాంబినేషన్ లో చార్మి నిర్మించిన సినిమా. ఈ సినిమాకు ఇటీవల మంచి క్రేజ్ వచ్చింది. అందుకే నాన్ థియేటర్ హక్కుల రూపంలో 14 కోట్ల వరకు ఆదాయం వచ్చినట్లు తెలుస్తోంది.

డిజిటల్, శాటిలైట్ హక్కులను జీ టీవీకి, హిందీ డబ్బింగ్ హక్కులను వేరే వారికి వేరు వేరుగా విక్రయించినట్లు తెలుస్తోంది. 14 కోట్లు అంటే మంచి మొత్తమే. థియేటర్ మీద కూడా ఇరవై కోట్లకు పైగా ఆశిస్తున్నారు. ఆంధ్రకే 10 కోట్ల రేషియోలో చెబుతున్నారు.

సినిమాకు ఇరవై కోట్లకు పైగా ఖర్చయినట్లు తెలుస్తోంది. రామ్, ఇద్దరు హీరోయిన్లు, కాస్త గట్టి స్టార్ కాస్ట్ వుండడం, మణిశర్మ సంగీతం, ఇంకా సాంకేతిక వర్గం అన్నీకలిసి, సినిమాకు బాగానే ఖర్చయినట్లు తెలుస్తోంది. ఈసారి ఈ సినిమాతో పూరి, చార్మి లాభాలు కళ్ల చూసేలా వున్నారు. 

జగన్‌ ఇంత దైర్యంగా చెప్పగలుగుతున్నారేమిటి