సంక్షేమాన్ని ప్రపంచానికి పరిచయం చేశారు

నాయకుడు అంటేనే ముందు చూపు ఉండేలా ఉండాలని అంటారు. అలాగే నాయకుడిలో దయ, మానవత్వం ఉండాలి. పేదా గొప్పా ఇలా అందరినీ కూడా కలుపుకుని మునుకుపోవాలి. సమాజ‌ క్షేమాన్ని సంక్షేమాన్ని కూడా చూసే వారే…

నాయకుడు అంటేనే ముందు చూపు ఉండేలా ఉండాలని అంటారు. అలాగే నాయకుడిలో దయ, మానవత్వం ఉండాలి. పేదా గొప్పా ఇలా అందరినీ కూడా కలుపుకుని మునుకుపోవాలి. సమాజ‌ క్షేమాన్ని సంక్షేమాన్ని కూడా చూసే వారే సిసలైన నాయకులుగా జనం గుండెలలో నిలిచిపోతారు.

అలాంటి వారిలో ఎన్నతగిన వారు వైఎస్సార్. ఆయన గురించి ఎందరో మంచి మాటలు చెప్పారు. ఆయన జయంతి వర్ధంతుల వేళ తలచుకుని ఎన్నో సంగతులు చెప్పుకుంటారు. విశాఖ జిల్లా వైసీపీ ప్రెసిడెంట్, మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు అయితే ఈ సందర్భంగా వైఎస్సార్ గురించి చెప్పిన ఒక మాట మాత్రం బాగా ఆకట్టుకునేలా ఉంది.

ఈ ప్రపంచానికే సంక్షేమం అన్న దాన్ని పరిచయం చేసిన వారు వైఎస్సార్ అని కొనియాడారు. నిజంగా ఈ ఒక్క మాట చాలు వైఎస్సార్ అంటే ఏమిటో చెప్పేయడానికి. వేయి మాటలేల  అన్నట్లుగా అవంతి వైఎస్సార్ అంటే ఏమిటి అన్న దానిని ఒకే ఒక మాటతో తేల్చేశారు.

అంతే కాదు వైఎస్సార్ తరువాత సంక్షేమాన్ని కొనసాగిస్తూ దానికి సరికొత్త అర్ధం చెప్పిన ఘనత తనయుడు జగన్ కే దక్కుతుంది అని అన్నారు. అయితే ఆయనను సంక్షేమ శిల్పిగానే తరాలుగా తెలుగు వారు గుర్తుంచుకుంటారు అన్నది సత్యమైన మాట.