ఆయనో సీనియర్ నిర్మాత. డిస్ట్రిబ్యూటర్ కూడా. ఈయన కూడా సీనియర్ నిర్మాతనే. డిస్ట్రిబ్యూటర్ కూడా. అంటే ఒకరి కష్టాలు ఒకరికి తెలుస్తాయి కదా.
ఓ సీనియర్ నిర్మాత ఓ ఏడాది రెండేళ్ల క్రితం నిర్మించిన సినిమాను మరో సినిమా నిర్మాత కొన్నారు. కొనేటపుడే తేడా వస్తే నెలలో డబ్బులు వెనక్కు ఇస్తాం అని అగ్రిమెంట్ చేసారు. సినిమా బాక్సాఫీస్ దగ్గర బకెట్ తన్నేసింది.
కానీ నెల దాటింది…నెలలు దాటాయి..మూడేళ్లు ఏళ్లు గడిచాయి. కానీ డబ్బులు మాత్రం రావడం కనిపించలేదు. ఆఖరికి కొంత వచ్చింది కొంత రాలేదు. మరో కోటి రూపాయల వరకు రావాలి.
ఇప్పుడు అసలు సంగతి ఏమిటంటే..బకాయి పడిన నిర్మాత లేటెస్ట్ గా ఓ సినిమా తీసారు. అమ్మేసి లాభాలు చేసుకున్నారు.
కానీ బాకీ తీర్చకపోగా లాభాలు వచ్చిన డబ్బులతో ఆంధ్రలో ఎక్కడ తక్కువకు భూములు దొరుకుతాయా? అని వెదుకుతున్నారట. పాపం డబ్బులు రావాల్సిన నిర్మాత అడిగితే ఒక పదిలక్షలు ఇస్తా సరిపెట్టుకో అంటున్నారట.
టాలీవుడ్ లో అంతే..టాలీవుడ్ లో అంతే. పూరి జగన్నాధ్ చెప్పినట్లు ఇక్కడ గిల్లితే గిల్లించుకోవాలి. నొప్పి అనకూడదు. అలా అంటే మళ్లీ ఇక్కడ సినిమాలు చేయడం కష్టం.