వైసీపీలోకి మళ్ళీ వలసలు …?

వైసీపీ అధికారంలోకి వచ్చి రెండేళ్ళు పై దాటింది. ఇప్పటిదాకా చూస్తే ప్రభుత్వం మీద వ్యతిరేకత పెద్దగా రాలేదు. లోకల్ బాడీ సహా తిరుపతి లోక్ సభ బై పోల్ లోనూ భారీ మెజారిటీని వైసీపీ…

వైసీపీ అధికారంలోకి వచ్చి రెండేళ్ళు పై దాటింది. ఇప్పటిదాకా చూస్తే ప్రభుత్వం మీద వ్యతిరేకత పెద్దగా రాలేదు. లోకల్ బాడీ సహా తిరుపతి లోక్ సభ బై పోల్ లోనూ భారీ మెజారిటీని వైసీపీ సాధించింది.

మరో వైపు చూస్తే ఈ రోజుకీ టీడీపీ ఇంకా ఓటమి నుంచి బయటపడిన దాఖలాలు లేవు. ఆ పార్టీ నేత‌లు వీధుల్లోకి వచ్చి ఉద్యమాలు చేసిన సీన్ కూడా ఇప్పటిదాకా ఎక్కడా లేదు. ఈ పరిణామాలు ఇలా ఉండగానే వచ్చే ఎన్నికల కోసం అపుడే గోడ దూకుళ్ళు, సర్దుబాట్లు మొదలైపోతున్నాయి. ఈసారి కూడా టీడీపీ గెలవదు అని గట్టిగా నిర్ణయించుకున్న వారంతా వైసీపీ వైపు చూస్తున్నారని టాక్.

ముఖ్యంగా ఉత్తరాంధ్రా జిల్లాల్లో ప్రముఖ గిరిజన నాయకురాలిగా ముద్ర పడిన రాష్ట్ర తెలుగు మహిళా మాజీ అధ్యక్షురాలు శోభా హైమావతి ఈ మధ్యనే సైకిల్ పార్టీకి గుడ్ బై కొట్టేశారు. ఆమె వైసీపీలో చేరుతారు అన్న ప్రచారం అయితే గట్టిగా ఉంది.

ఆమెతో పాటు మూడు జిల్లాలలో ఉన్న మాజీ ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు చాలా మంది కూడా అధికార పార్టీ వైపు ఆశగా చూస్తున్నారు అన్న టాక్ ఉంది. ఈ మధ్యన జరిగిన నామినేటెడ్ జాతరను చూసిన వారంతా జగన్ పార్టీలో చేరితే గుర్తింపు ఖాయమన్న భావనను వచ్చారని అంటున్నారు. 

మరి ఈ మలి విడత వలసలు గట్టిగానే ఉండే అవకాశం ఉంది. అదే కనుక జరిగితే అంతంతమాత్రంగా ఉన్న టీడీపీ పరిస్థితి మరింత దిగజారడం ఖాయమనే అంటున్నారు. చూడాలి మరి.