టాలీవుడ్ పవర్ స్టార్, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఇవాళ 54 ఏళ్లు పూర్తి చేసుకుని 55వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నారు. ఇవాళ పవర్ స్టార్ బర్త్ డే సందర్భంగా తన సూపర్ హిట్ సినిమా జల్సా ను మళ్లీ థియెటర్స్ లో రిలీజ్ చేశారు. థియేటర్ల దగ్గర పవన్ ఫ్యాన్స్ హంగామ చేస్తున్నారు.
తమ అభిమాన హీరో సినిమా అభిమానించడం, సందడి చేయడం తప్పు లేదు.. కానీ పవన్ ఫ్యాన్స్ చాల చోట్ల ఉన్మాదులగా ప్రవస్తిస్తూ పవన్ కు చెడ్డపేరు తెస్తున్నారు. పవన్ ఫ్యాన్స్ రెండు రోజుల క్రితం ఆంధ్రలో ఒక డిమార్ట్ దగ్గర చేసిన రచ్చకు మిగత హీరో ఫ్యాన్స్ ఎలా ఆడుకుంటూన్నారో అందరికి తెలిసిందే.
ఇవాళ కూడా సినిమా థియెటర్స్ దగ్గర కూడా రచ్చ రచ్చ చేశారు. థియెటర్స్ లో గ్యాస్ తో ఫైర్ చేస్తూ నానా హంగమా చేసి భయబ్రాంతులకు గురి చేశారు. సినిమా చూడటం తప్పా అని పనులు చేశారు. కొన్ని చోట్ల థియెటర్స్ సౌండ్ సిస్టమ్స్ బాగా లేదని థియెటర్స్ పై రాళ్ళు విసిరి ఆందోళనకు దిగారు. కొందరు అభిమానులు ఏకంగా కొన్ని థియోటర్ స్క్రీన్ పైకి ఎక్కి తీన్మార్ స్టెప్పులు వేస్తూ రచ్చ రచ్చ చేశారు. ఫ్యాన్స్ వీరంగంతో జల్సా సినిమా షోను కాసేపు నిలిపేశారు.
అందరూ హీరోల అభిమానులు కూడా దాదాపు ఎక్కడైనా సినిమాను సినిమా లాగా చూస్తారు. అభిమాన హీరో కనపడగానే సందడి చేయడం మాములే కానీ పవన్ అభిమానులు మాత్రం థియోటర్స్ పై దాడులు చేస్తున్నారు. గతంలో వకీల్ సాబ్ సినిమా విషయంలో కూడా వారు చేసిన రచ్చ వల్ల సామన్య ప్రేక్షకులు థియెటర్స్ కు రాలేదంటే అతిశయోక్తి కాదు.
పవన్ కూడా తన అభిమానులను కంట్రోల్ చేయడం లేదని వినిపిస్తుంది. గతంలో పవన్ చెప్పినట్లు నా అభిమానలే నాకు ఓటు వేయాలేదంటే అభిమానులు ఎంత వరకు తనకు నష్టం చేస్తున్నారో ఇప్పటికైనా గ్రహించాలి. ఒక సిని అభిమానులనే నమ్ముకొని రాజకీయాల్లోకి వస్తే గత ఎన్నికలప్పుడు వచ్చిన ఫలితాలే వస్తాయి.
అభిమానం అనేది హద్దులో ఉండాలి. వారి అభిమాన హీరోను పూజించడం తప్పు లేదు.. కానీ పక్క వారి అస్తులను ధ్వంసం చేయడం, పక్క వారిని ఇబ్బందులు గురి చేయడం ఎంత వరకు కరెక్ట్ అనేది తెలుసుకుంటే… అభిమానుల వల్ల లాభం జరగకపోయిన నష్టం మాత్రం జరగదు.