ఈరోజు మరో క్రేజీ కాంబినేషన్ సెట్ అయింది. శేఖర్ కమ్ముల, ధనుష్ కలిసి ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడీ ప్రాజెక్టులోకి రష్మిక ఎంటరైంది. ధనుష్-కమ్ముల-రష్మిక.. చాలా క్రేజీగా ఉంది ఈ కాంబినేషన్.
కెరీర్ లో 51వ చిత్రాన్ని శేఖర్ కమ్ములతో చేయబోతున్నాడు ధనుష్. చాన్నాళ్ల కిందటే ప్రకటించిన ఈ మూవీకి సంబంధించి ప్రీ-ప్రొడక్షన్ పనులు స్టార్ట్ చేశాడు కమ్ముల. ఇందులో భాగంగా రష్మికను హీరోయిన్ గా తీసుకున్నాడు.
కమ్ముల సినిమాల్లో హీరోయిన్ కు మంచి ప్రాధాన్యం ఉంటుందనే సంగతి తెలిసిందే. ఫిదా, లవ్ స్టోరీ సినిమాలతో సాయిపల్లవి రేంజ్ ఏ స్థాయిలో పెరిగిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడా అవకాశం రష్మిక సొంతమైంది. ఆల్రెడీ జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది రష్మిక. కమ్ముల సినిమాతో ఆమె క్రేజ్ మరింత పెరిగే అవకాశం ఉంది.
తన రెగ్యులర్ స్టయిల్ లో భాగంగా ఈ సినిమాకు కూడా శేఖర్ కమ్ముల వర్క్ షాప్ నిర్వహించే అవకాశం ఉంది. అయితే ఫుల్ బిజీగా ఉండే ధనుష్, రష్మికతో వర్క్ షాప్ సాధ్యమౌతుందా?