Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

చిరు పుణ్యం-తాకట్టులో ‘తోట’!

చిరు పుణ్యం-తాకట్టులో ‘తోట’!

సూర్యాపేటలో రాజుగారితోట అన్నది విజయవాడ రోడ్‌లో ప్రయాణించేవారందరికీ పరిచయమే. ఆ ధాబాలో ఎప్పుడో అప్పుడు ఫుడ్ టేస్ట్ చేసే వుంటారు. ఆ ధాబా ఎవరిదో కాదు. నిర్మాత అనిల్ సుంకర దే. దాంట్లో భాగస్వాములు కూడా వున్నారు. కానీ ఆ ధాబా వున్న భూమి మాత్రం అనిల్ సుంకరదే. 

దాదాపు మూడు ఎకరాల పైనే.  చిరు సినిమా భోళా శంకర్ పుణ్యమా అని ఇప్పుడు దాన్ని తాకట్టు పెట్టాల్సి వచ్చిందని తెలుస్తోంది. సినిమా ఆశించిన రేంజ్ మార్కెట్ కాకపోవడం, దాదాపు మూడు వంతులకు పైగా ఏరియాలు స్వంతంగా పంపిణీ చేసుకోవాల్సి రావడంతో సినిమా నిర్మాణానికి అయిన ఖర్చును, మెగాస్టార్‌కు ఇచ్చిన 65 కోట్లను మొత్తం తానే భర్తీ చేయాల్సి వచ్చింది.

ఎవరైనా సినిమాను ఫైనాన్స్ మీదే నిర్మిస్తారు. విడుదలకు ముందు అన్ని ఏరియాలు అమ్మి, నాన్ థియేటర్ డబ్బులు సమకూర్చి ఫైనాన్స్ క్లియర్ చేస్తారు. కానీ భోళా శంకర్ సినిమాను కీలకమైన నైజాం ఏరియాకు కూడా ఎవరూ కొనలేదు. ఓవర్ సీస్ బయ్యర్ కూడా కొనలేనన్నారు. ఆంధ్రలో చాలా ఏరియాలు కూడా ఇదే పరిస్థితి. 

అంత కన్నా దారుణం ఏమిటంటే మెగాస్టార్ సినిమా శాటిలైట్ అమ్ముడు పోలేదు. దాంతో స్వంత డబ్బులు సమకూర్చుకుని ఫైనాన్స్ క్లియర్ చేసి, మెగాస్టార్ రెమ్యూనిరేషన్ పే చేసి సినిమా విడుదల చేయాల్సి వచ్చింది.

అందరూ అనుకుంటున్నట్లు అనిల్ సుంకర ఆస్తులు ఏవీ అమ్మలేదు. వాటి మీద పూచి కత్తు రుణాలు తెచ్చుకున్నారంతే. అలాగే ఇంకో అపోహ కూడా వుంది. కెఎస్ రామారావు కూడా నిర్మాణ భాగస్వామి అని, మధ్యలో తప్పుకున్నారని, కానీ అదీ నిజం కాదు, మెగాస్టార్ కోరిక మేరకు కెేఎస్ రామారావు బ్యానర్ యాడ్ చేసారు అంతే. రాయల్టీగా నాలుగైదు కోట్లు ఇవ్వాలని మెగాస్టార్ కోరారు. కానీ ప్రాజెక్ట్ మధ్యలోనే అంత లాభసాటి కావడం లేదని తేలడంతో, కేఎస్ రామారావు పేరు డ్రాప్ చేసారు. ఆయనకు వేరే సినిమా చేస్తా అని మెగాస్టార్ మాట ఇచ్చారు. 

ఇప్పుడు మళ్లీ అమెరికాలో అనిల్ సుంకర కష్టపడి డబ్బులు సంపాదించాలి. తన తోటను తాను వెనక్కు తెచ్చుకోవాలి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?