క్యారెక్టర్ కోసం సాయిపల్లవి ఏ రేంజ్ లో కష్టపడుతుందో అందరికీ తెలిసిందే. ఆమె యాక్టింగ్ ను ఎవ్వరూ వంకపెట్టలేరు. ఆమె డెడికేషన్ ఏ రేంజ్ లో ఉంటుందనడానికి మరో ఎగ్జాంపుల్ ఇది. పాత్ర కోసం ఆమె ఒక రోజంతా ఏమీ తినలేదంట.
విరాటపర్వం సినిమాలో లీడ్ రోల్ చేసింది సాయిపల్లవి. ఇందులో రానా హీరోనే అయినప్పటికీ, సినిమా మొత్తం సాయిపల్లవి పాత్ర చుట్టూ తిరుగుతుంది. వెన్నెల అనే పాత్ర పోషించిన సాయిపల్లవి, ఈ సినిమాలో ఓ సీన్ కోసం నీరసంగా కనిపించాలి. దాని కోసం ఆమె ఒక రోజంతా తినడం మానేసిందట.
ఈ విషయాన్ని దర్శకుడు వేణు ఊడుగుల చెప్పుకొచ్చాడు. ఓ క్యారెక్టర్ కోసం సాయిపల్లవి పడే కష్టం ఆ రేంజ్ లో ఉంటుందని అంటున్నాడు ఈ డైరక్టర్.
1990ల్లో తెలంగాణలో జరిగిన కొన్ని యదార్థ ఘటనల ఆధారంగా, నక్సల్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కిన చిత్రం విరాటపర్వం. చాన్నాళ్లుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఎట్టకేలకు విడుదలకు సిద్ధమైంది. జులై 1న విరాటపర్వం సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. ప్రియమణి, నందితాదాస్, నవీన్ చంద్ర ఇతర ముఖ్యపాత్రలు పోషించారు.