పవన్…ఒకసారి ఇటు చూడు

ఎవరైనా సరే ఇంట గెలిచి రచ్చ గెలవాలి. మన ఇంట్లో వ్యవహారాలు చక్కదిద్దుకుని ఆపై జ‌నాలను ఉద్దరించాలి. కానీ పవన్ కళ్యాణ్ వ్యవహారం అలా కాదు. Advertisement నిర్మాతలు ఎలా పోయినా ఫరవాలేదు. వాళ్లు…

ఎవరైనా సరే ఇంట గెలిచి రచ్చ గెలవాలి. మన ఇంట్లో వ్యవహారాలు చక్కదిద్దుకుని ఆపై జ‌నాలను ఉద్దరించాలి. కానీ పవన్ కళ్యాణ్ వ్యవహారం అలా కాదు.

నిర్మాతలు ఎలా పోయినా ఫరవాలేదు. వాళ్లు అప్పులు చేసి వడ్డీలు కట్టుకుంటూ ఏమై పోయినా ఫరవాలేదు. తాను మాత్రం వాళ్ల అడ్వాన్స్ లు జేబులో వేసుకుని వడ్డీలేని అప్పుల్లాంటి అడ్వాన్స్ లు ఎంజాయ్ చేస్తూ వుంటారు. 

ఎఎమ్ రత్నం ఇచ్చిన జ‌మానా కాలం నాటిది. మైత్రీ మూవీస్ అడ్వాన్స్ మరెప్పటిదో. రామ్ తాళ్లూరి వ్యవహారం వారిద్దరికే తెలియాలి. మొన్నటికి మొన్న పీపుల్స్ మీడియా అడ్వాన్స్.

కానీ సినిమాలు మాత్రం అతీగతీలేదు. సముద్రఖని లాంటి వాళ్లు సినిమాలు అన్నీ వదిలేసుకుని,ఆదాయం వదిలేసుకుని అలా పడిగాపులు పడాలి. హరి హర వీరమల్లు కోసం కొట్లు ఖర్చు చేసి వేసిన సెట్ లు పాడై పోతున్నా పవన్ కు పట్టదు. 

నగర శివార్లలో హరి హర వీరమల్లు కోసం వేసిన స్ట్రీట్ సెట్ మొత్తం పాడయిపోయింది. చార్మినార్ లాంటి కట్టడం ఒకటి వేసారు. అది పెచ్చులు ఊడిపోతోంది. స్ట్రక్చర్ మాత్రం మిగిలేలా వుంది.

మళ్లీ వేయాలంటే మరిన్ని కోట్లు ఖర్చు. వీటి గురించి మాత్రం పవన్ కు పట్టదు. జ‌గన్ ప్రభుత్వం మీద నిత్యం ట్వీట్ లు వేసే సమయంలో కాస్తయినా వీటి మీద పెడితే ఈ పాటికి ఈ సినిమాల విషయంలో ఓ క్లారిటీ వచ్చేది. 

దర్శకుడితే తప్పు అన్నట్లు ఓ సినిమాను, కథ సెట్ కావడం లేదు మీదే తప్పు అన్నట్లు మరో సినిమాను, ఇలా వెనక్కు నెట్టుకుంటూ కాలం గడిపేస్తున్నారు. పవన్ హరి హర వీర మల్లు సెట్ లు ఓసారి చూసి వస్తే బాగుంటుందేమో? తన రాజ‌కీయ యాత్ర ప్రారంభించే లోపు.