బహుశా చాలా కాలం తర్వాత సినిమా వాళ్ల పేర్లు పోర్న్ వ్యవహారంలో వినిపిస్తున్నాయి. సినిమా వాళ్లు ఈ తరహా సినిమాల్లో నటిస్తారనే అసంబద్ధమైన ప్రచారాలు గత కాలంలో ఉండేవి. 80లలో, ఆ ప్రభావంతో 90లలో సినిమా వాళ్లూ – పోర్న్ వంటి వాటి విషయంలో సామాన్య సినీ ప్రేక్షకులు రసవత్తరమైన రూమర్లను చెప్పుకునే వారు. అయితే ఆ తర్వాత అవగాహనలోకి వచ్చిన అంశం ఏమిటంటే.. భారతీయ సినిమా వాళ్లు దాదాపుగా పోర్న్ జోలికి వెళ్లారని. నటీనటులు ఆ తరహా వ్యవహారాల్లో తల దూర్చరని, వాటిల్లోకి వెళితే తమ కెరీర్ పూర్తిగా పతనం అవుతుందనే విషయం వారికి తెలుసు కాబట్టి.. అధికారికంగా ఆమోదముద్ర లేని పోర్న్ వ్యవహారం లోకి వీళ్లు తలదూర్చరని సామాన్య ప్రేక్షకులకు క్లారిటీ వచ్చింది.
దీంతో పలానా నటి బ్లూ ఫిల్మ్ అంటూ ఎవరైనా ఏదైనా చెప్పినా ఎవ్వరూ నమ్మే పరిస్థితి లేదిప్పుడు. అదే 90లలో అయితే.. హీరోయిన్ల బ్లూ ఫిల్మ్ లు పేరుతో రకరకాల క్యాసెట్లు అమ్ముడయ్యేవని ఆ తరం వారు చెబుతారు. చెన్నైలో కొన్ని ఏరియాల్లో సెలబ్రిటీల పేరుతో ఇలాంటి క్యాసెట్లు అమ్ముకునే వారని ఈ మధ్య కూడా కొందరు సోషల్ మీడియాలో రాస్తుంటారు. అయితే సీడీల కాలానికే ప్రజలకు జ్ఞానోదయం అయ్యింది. హీరోయిన్ల పేర్లతో అమ్ముడయ్యే పోర్న్ అంతా బోగస్ అని. దీంతో సినిమా వాళ్లను పోర్న్ కు అతీతంగా చూడటం జరుగుతోంది. అయితే దేశ వ్యాప్తంగా ప్రముఖురాలు అయిన నటి శిల్పా షెట్టి భర్త ఇప్పుడు పోర్న్ వ్యవహారంలో అరెస్టు కావడం సంచలనంగా మారింది.
అటు వ్యక్తిగత, ఇటు వ్యాపార వ్యవహారాల్లో కూడా రాజ్ కుంద్రా వివాదాస్పదుడే. ఈ మధ్యనే తన మాజీ భార్యపై కూడా భారీ నిందలు మోపాడు. తన చెల్లెలు భర్తతో తన మాజీ భార్య ఎఫైర్ పెట్టుకుందని.. ఆమె చెప్పినా వినలేదని, అందుకే తను ఆమెకు విడాకులు ఇచ్చినట్టుగా కుంద్రా చెప్పుకొచ్చాడు. అయితే ఇప్పుడు అతడే ఏకండా పోర్న్ వ్యవహారంలో అరెస్టు కావడంతో.. మాజీ భార్యపై మోపిన అపవాదుల విషయం కూడా ఏది నిజమో అనుకునేలా మారింది.
పోర్న్ సైట్లలో కొందరు భారతీయ ఆర్టిస్టుల బ్లూ ఫిల్మ్ లు ప్రచారంలోకి వచ్చాయి. అయితే.. ఇవన్నీ పచ్చి బ్లూ ఫిల్మ్ ల తరహాలో కాకుండా.. వెబ్ సీరిస్ ల పేరుతో ప్రచారానికి ఉంచుతున్నారట. హాలీవుడ్ వాళ్లు తీసే వెబ్ సీరిస్ లలో కొన్ని న్యూడ్ సీన్లు ఉంటాయి. వాటి లాగే హిందీ వెబ్ సీరిస్ లలో కూడా ఇలాంటి సీన్లను తీసినట్టుగా చూపుతుంటారు. హాలీవుడ్ వెబ్ సీరిస్ లలో అవసరార్థమో, ఎరోటిక్ గా ఉంచడానికో కొన్ని సీన్లను తీస్తే.. ఈ హిందీ వెబ్ సీరిస్ ల లక్ష్యమే పోర్న్ గా మారింది!
వెబ్ సీరిస్ కు కథ, కథనాలు ఏమీ ఉండకపోయినా… ఇలాంటి సీన్లను వీలైనంతగా దట్టిస్తుంటారు. అర్ధనగ్నం కాకుండా, పూర్తిగా పోర్న్ ను చిత్రీకరిస్తూ వెబ్ మీదకు వదులుతున్నారు. ఈ వ్యవహారంపై పోలీసుల విచారణ అటు తిరిగి ఇటు తిరిగి రాజ్ కుంద్రా వద్దకు వెళ్లినట్టుగా ఉంది. ముందుగా ఒకసారి ప్రశ్నించే, ఆ తర్వాత కుంద్రాను అరెస్టు చేశారట పోలీసులు. ఏదో బాలీవుడ్ లో చోటా మోటా నటీనటులు ఇలాంటి దందాలో దొరికి ఉంటే అదంత సంచలన అయ్యేది కాదు. రాజ్ కుంద్రా ఫేమస్ కాకపోవచ్చు కానీ, శిల్పా షెట్టికి ఉన్న గుర్తింపు నేపథ్యంలో ఆమె భర్త పోర్న్ దందాలో దొరికాడనే వార్త హాట్ టాపిక్ గా మారుతోంది.