క్రేజీ ప్రాజెక్టు ఆర్ఆర్ఆర్ కు మరో క్రేజీ పాయింట్ యాడ్ అయింది. ఈ సినిమా కోసం గత రెండు రోజులుగా ప్రమోషన్ సాంగ్ పిక్చరైజ్ చేస్తున్నారు.
ఆర్ఆర్ఆర్ కు దర్శకుడు రాజమౌళి సోదరుడు కీరవాణి మ్యూజిక్ డైరక్టర్ అన్న సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రమోషన్ సాంగ్ ను మాత్రం యువ సంగీత సంచలన అనిరుధ్ పాడడం విశేషం. అంతే కాదు. ఈ ప్రమోషన్ సాంగ్ లో అనిరుధ్ డ్యాన్స్ చేస్తున్నాడు కూడా.
సంగీత దర్శకుడు అనిరుధ్ మల్టీ టాలెంటెడ్ పర్సన్. పాటలు పాడతాడు. రాస్తాడు. డ్యాన్స్ చేస్తాడు. ఆ మధ్య వచ్చిన గ్యాంగ్ లీడర్ సినిమా కోసం ప్రమోషన్ సాంగ్ ను అలాగే తనే డిజైన్ చేసాడు. గతంలో వచ్చిన అజ్ఞాతవాసి సినిమాలో పాటకు తానే ఓ విడియో సాంగ్ డిజైన్ చేసుకుని పిక్చరైజ్ చేస్తాడు.
ఆర్ఆర్ఆర్ సినిమాకు భయంకరమైన క్రేజ్ వుంది. ఇప్పుడు అనిరుధ్ తో తయారుచేస్తున్న ప్రమోషన్ సాంగ్ తో ఆ క్రేజ్ మరింత పెరుగుతుంది.
సినిమా అక్టోబర్ 13న విడుదల అని ఆర్ఆర్ఆర్ యూనిట్ ఇప్పటికి ఒకటికి రెండు సార్లు ప్రకటించింది. కానీ విడుదల పక్కా వుంటుందా అనే దాని మీద మాత్రం రకరకాల గ్యాసిప్ లు వున్నాయి.