పడుతూ లేస్తూ కెరీర్ సాగిస్తున్న నభా నటేష్ కు మరో అవకాశం దక్కింది. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఆమె గోపీచంద్ సరసన ఓ సినిమా చేసే ఛాన్స్ ఉంది. శ్రీవాస్ దర్శకత్వంలో రీసెంట్ గా ఓ కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు గోపీచంద్. ఇందులో హీరోయిన్ గా నభాను అనుకుంటున్నారట.
హీరోయిన్ల విషయంలో గోపీచంద్ ది లక్కీ హ్యాండ్ అంటారు. అందరి విషయంలో కాకపోయినా, అనుష్క, రకుల్, రాశిఖన్నా లాంటి హీరోయిన్ల విషయంలో ఇది ఓ మోస్తరుగా నిజమైంది. ఇదే మేజిక్ నభాకు కూడా రిపీట్ అయితే ఆమె పంట పండినట్టే.
ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ తర్వాత తనకు అవకాశాలు క్యూ కడతాయని భావించింది నభా నటేష్. కానీ ఆమెకు చెప్పుకోదగ్గ స్థాయిలో ఛాన్సులు రావడం లేదు. డిస్కో రాజా, అల్లుడు అదుర్స్ లాంటి సినిమాలు ఆమెను దెబ్బ కొట్టాయి. దీంతో తప్పనిసరి పరిస్థితుల మధ్య తన దగ్గరకొచ్చిన అవకాశాలకు వెంటవెంటనే ఓకే చెప్పేస్తూ కెరీర్ బండి లాగించేస్తోంది.
ప్రస్తుతం నితిన్ సరసన మాస్ట్రో సినిమా చేస్తోంది నభా నటేష్. ఈ సినిమా థియేటర్లలో రిలీజై, క్లిక్ అయితే తనకు కలిసొస్తుందని ఆమె భావించింది. కానీ మాస్ట్రో సినిమా ఓటీటీకి వెళ్లింది. నభా ఆశలపై నీళ్లు చల్లింది. ఇక ఇప్పుడు ఆమె ఆశలన్నీ గోపీచంద్ సినిమాపైనే.