సంక్రాంతి సినిమా ‘శ్రీకారం’

శర్వానంద్-14రీల్స్ కాంబినేషన్ లో అనౌన్స్ చేసి, పూజ చేసేసిన సినిమా 'శ్రీకారం'. ఈ సినిమాను ముందే సంక్రాంతి విడుదల అని ప్రకటించేసారు. ఇప్పటికే బన్నీ, మహేష్ బాబు, రజనీ, బాలకృష్ణ సినిమాలు సంక్రాంతికి వున్నాయి.…

శర్వానంద్-14రీల్స్ కాంబినేషన్ లో అనౌన్స్ చేసి, పూజ చేసేసిన సినిమా 'శ్రీకారం'. ఈ సినిమాను ముందే సంక్రాంతి విడుదల అని ప్రకటించేసారు. ఇప్పటికే బన్నీ, మహేష్ బాబు, రజనీ, బాలకృష్ణ సినిమాలు సంక్రాంతికి వున్నాయి. మరి వీటి మధ్యలో శర్వానంద్ సినిమా కూడా అంటే ఆలోచించాల్సిందే.

అయితే గతంలో రెండుసార్లు శర్వానంద్ సంక్రాంతికి పెద్ద సినిమాల నడుమ వచ్చి హిట్ లు కొట్టాడు. మరి ఆ సెంటిమెంట్ తోనే సంక్రాంతికి రెడీ అవుతున్నాడేమో? అని అనుకుంటే, అది మాత్రమే కాదని, కథ కూడా సంక్రాంతికి పనికి వచ్చేదని తెలుస్తోంది.

శ్రీకారం కథ కూడా మహర్షి సినిమా మాదిరిగా పొలాలు, పచ్చదనం, పల్లెటూర్ల చుట్టూ తిరుగుతుందని, కొత్త మార్పుకు, కొత్త ప్రగతికి శ్రీకారం చుట్టడం అనే మెసేజ్ వుంటుందని తెలుస్తోంది. అందుకే శ్రీకారం టైటిల్, సంక్రాంతి విడుదల అన్నది యూనిట్ ప్లాన్ అని తెలుస్తోంది.

ఈ లెక్కన చూస్తుంటే 2020 సంక్రాంతి మాత్రమేకాదు, జనవరి ఒకటి నుంచి నెలాఖరు వరకు ఫుల్ సినిమాలే సినిమాలు వుండేలా కనిపిస్తున్నాయి.

దాడులపై బాబు మౌనం.. ఓటమికి ఇది కూడా కారణమే