అండర్‌ వరల్డ్‌ డాన్‌ పై భారీ రివార్డు

అండర్ వరల్డ్ డాన్ దావుద్ ఇబ్రహీం, అత‌ని సహచరులపై జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) వేట మొద‌లు పెట్టింది. తాజాగా దావుద్ ఇబ్ర‌హీం, అత‌ని అనుచ‌రుల గురించి స‌మాచారం ఇస్తే రివార్డు ఇస్తామ‌ని ఎన్ఐఏ ప్ర‌క‌టించింది.…

అండర్ వరల్డ్ డాన్ దావుద్ ఇబ్రహీం, అత‌ని సహచరులపై జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) వేట మొద‌లు పెట్టింది. తాజాగా దావుద్ ఇబ్ర‌హీం, అత‌ని అనుచ‌రుల గురించి స‌మాచారం ఇస్తే రివార్డు ఇస్తామ‌ని ఎన్ఐఏ ప్ర‌క‌టించింది.

దావుడ్ ఇబ్ర‌హీంపై 25 ల‌క్ష‌లు, అత‌డి అనుచ‌రులైన చోటా ష‌కీల్ పై 20 ల‌క్ష‌లు, ఇంకా జావెద్, ఇబ్ర‌హీం, టైగ‌ర్ మెమ‌న్ ల‌పై 14 ల‌క్ష‌ల చొప్పున రివార్డులు ప్ర‌క‌టించారు ఎన్ఐఏ అధికారులు

1976లో డి కంపెనీను స్ధాపించి ఎన్నో నేరాలలో పాల్ప‌డిన దావుద్ చాల కేసుల్లో నిందితుడు ఉన్నారు. దావుద్ ఇబ్ర‌హీం 1993లో ముంబాయి వ‌ర‌స పేలుళ్ల ఘ‌ట‌న త‌ర్వాత ఇండియాను వదిలి పెట్టి  పాకిస్తాన్ పారిపోయాడు. పాకిస్తాన్ నుండే దావుద్ కార్య‌క‌ల‌పాలు చేస్తుంటార‌ని పోలీసు ఉన్న‌తాధికారులు అనుమానిస్తున్నారు.

పాక్ లో ఉంటూ అంత‌ర్జాతీయ ఉగ్ర ముఠాల‌కు దావుద్ కీల‌క స‌హ‌కారం అదిస్తున్న‌ట్లు ఎన్ఐఏ అధికారులు అనుమానిస్తున్నారు. గ‌తంలో దావుద్ ఇబ్రహీంను ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది.