టాలీవుడ్ కు గురి పెడుతున్నారు

ఇప్పుడు టాలీవుడ్ లో అంతా యంగ్ బ్లడ్. హీరోలు..దర్శకులు..నిర్మాతలు. అంతా యంగ్ బ్లడ్ నే. ఒకప్పుడు ఎవరైనా కాస్త చిలక్కొట్టుడు వ్యవహారం వుంటే హీరోయిన్లుగా తీసుకునేవారిని ‘కమిట్ మెంట్’ లు అడిగేవారు అని టాక్…

ఇప్పుడు టాలీవుడ్ లో అంతా యంగ్ బ్లడ్. హీరోలు..దర్శకులు..నిర్మాతలు. అంతా యంగ్ బ్లడ్ నే. ఒకప్పుడు ఎవరైనా కాస్త చిలక్కొట్టుడు వ్యవహారం వుంటే హీరోయిన్లుగా తీసుకునేవారిని ‘కమిట్ మెంట్’ లు అడిగేవారు అని టాక్ వుంది. ఆ మధ్య దీని మీదే చాలా రగడ కూడా జరిగింది. 

కానీ రోజులు మారాయి, మారుతున్నాయి. అమ్మాయిలే ‘కమిట్ మెంట్లు’ ఆఫర్ చేస్తున్నారనే కొత్త వింతలు వినిపిస్తున్నాయి. ఫలానా సినిమా ఇచ్చినా, ఫలానా పాత్ర ఇచ్చినా ‘కమిట్ మెంట్’ కు రెడీ అనే ఆఫర్ ను నర్మగర్భంగా తెలియచేస్తున్నారట.

దేశంలోని పలు ‘వుడ్’ లకు చెందిన వారంతా తెలుగు సినిమాల మీద దృష్టి పెడుతున్నారు. ఒక్క హిట్ పడితే చాలు రెమ్యూనిరేషన్ కోటి దాటేస్తుంది. ఆ ఒక్క హిట్ కావాలంటే సరైన సినిమా, సరైన ప్రాజెక్టు పడాలి. అందుకే సోషల్ మీడియా మీద, వెబ్ సైట్ల మీద దృష్టి పెడుతున్నారట. 

ఏ సంస్థ ఏ సినిమా ప్లాన్ చేస్తోంది. హీరో ఎవరు, దర్శకుడు ఎవరు అన్నీ తెలుసుకుని, ఆ పైన ఎవరికి ఆఫర్ ఇవ్వాలి. ఎవరికి ఆఫర్ ఇస్తే మనకు ఆఫర్ వస్తుంది అనే ప్లానింగ్ బాగానే చేస్తున్నారని బోగట్టా.

మీరు ఫలానా సినిమా చేస్తున్నారు కదా..అందులో హీరోయిన్ పాత్ర ఇస్తే కమిట్ మెంట్ కు రెడీ అనే ఫీలర్ ను చాలా స్మూత్ గా ఇంజెక్ట్ చేస్తున్నారట. అయితే మన దర్శకులు, నిర్మాతలు, హీరోలు తెలివైన వారు. తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే అన్నట్లుగా, సినిమా, దానికి తగిన కాస్టింగ్ అన్నదే చూస్తున్నారు తప్ప ఇలాంటి ఎరలకు లొంగడం లేదట. 

డబ్బులు, విలాసాలు, బహుమతులు అయితే ఓకె కానీ సినిమాలు అడగొద్దు అనే టైపులో సమాధానాలు ఇస్తున్నారని బోగట్టా.