ఆంత్రాక్స్ భయం…వణుకుతున్న జనం

ఆంత్రాక్స్ భయం మరోసారి ఆ జిల్లాను పట్టి పీడిస్తోంది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఆంత్రాక్స్ కేసులు ఒకేసారి  ఏడు దాకా వైద్య శాఖాధికారులు గుర్తించారు. జిల్లాలోని ముంచింగ్ పట్టులో ఆంత్రాక్స్ కేసులు ఎక్కువగా ఉన్నాయని…

ఆంత్రాక్స్ భయం మరోసారి ఆ జిల్లాను పట్టి పీడిస్తోంది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఆంత్రాక్స్ కేసులు ఒకేసారి  ఏడు దాకా వైద్య శాఖాధికారులు గుర్తించారు. జిల్లాలోని ముంచింగ్ పట్టులో ఆంత్రాక్స్ కేసులు ఎక్కువగా ఉన్నాయని అనుమానిస్తున్నారు.

దాంతో ఆంత్రాక్స్ లక్షణాలు ఉన్నాయని భావిస్తున్న ఏడుగురి నుంచి శాంపిల్స్ కలెక్ట్ చేసి ల్యాబ్ కి పంపారు. ఈ శాంపిల్స్ రిజల్ట్ ని బట్టి తదుపరి చర్యలకు దిగాలని  వైద్య శాఖ అధికారులు భావిస్తున్నారు.

ఇక ముంచింగ్ పట్టులో ఇప్పటికే ఆంత్రాక్స్ నియంత్రణకు ముందస్తు చర్యలను చేపట్టినట్లుగా అధికారులు తెలిపారు. జంతువుల నుంచి ఈ వ్యాధి మనుషులకు సంక్రమిస్తుంది. దాంతో జంతువులకు కూడా వ్యాక్సినేషన్ చేసినట్లుగా అధికారులు పేర్కొంటున్నారు.

ఇదిలా ఉండగా ఈ ఏజెన్సీ జిల్లా ఇప్పటికే విష జ్వరాలతో ఇబ్బంది పడుతోంది. ప్రతీ వర్షకాలంలో సీజనల్ వ్యాధులతో పాటు విష జ్వరాలు కూడా రావడం జరుగుతోంది. ఇపుడు ఆంత్రాక్స్ భయం తో గిరిజనం తల్లడిల్లుతున్నారు. ఆ ఒక్క ఏడుగురికేనా ఈ లక్షణాలు ఉన్నాయి ఇంకా పెద్ద సంఖ్యలో ఎవరైనా ఆంత్రాక్స్ లక్షణాలతో ఉన్నారా అన్న దాని మీద కూడా అధికారుల బృందం పరిశోధిస్తోంది.