టీజర్ లాంచింగ్ కు 12 లక్షలు!

సెల్రబిటీలు అయితే చాలు బోలెడు సంపాదన మార్గాలు. పైగా సోషల్ మీడియాలో ఎంత పాపులర్ అయితే అది కూడా ఆదాయ మార్గమే. ఓ ట్వీట్ వేయాలంటే లక్షలు.  Advertisement ఒక ఇన్ స్టాగ్రామ్ పోస్ట్…

సెల్రబిటీలు అయితే చాలు బోలెడు సంపాదన మార్గాలు. పైగా సోషల్ మీడియాలో ఎంత పాపులర్ అయితే అది కూడా ఆదాయ మార్గమే. ఓ ట్వీట్ వేయాలంటే లక్షలు. 

ఒక ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ వేయాలంటే లక్షలు. ఆఖరికి మొహమాటానికి ఓ టీజర్ లో ఫస్ట్ లుక్ నో లాంచ్ చేయాలన్నా డబ్బులే..సంపాదనే. ఇదంతా రహస్యం ఏమీ కాదు అంతా ఓపెన్ నే.

ఈ మధ్య బాయ్స్ అనే చిన్న సినిమా టీజర్ ను పాపులర్ బాలీవుడ్ హీరోయిన్ సన్నీ లియోన్ ముంబాయిలో ఆవిష్కరించింది. ఇదెలా సాధ్యం కొందరు ఆలోచించారు. నిర్మాత కమ్ హీరోయిన్ కు పరిచయం అయి వుంటారు అని మరి కొందరు అనుకున్నారు. కానీ దీని వెనుక అంతా పక్కా కమర్షియల్ అని తెలుస్తోంది.

టీజర్ లాంజ్ చేయడానికి సన్నీ లియోన్ ఏకంగా 12లక్షలు పారితోషికంగా తీసుకుందని యూనిట్ వర్గాల బోగట్టా. ఓ చిన్న సినిమా టీజర్ సర్రున జనాల్లోకి వెళ్లాలంటే ఆ మాత్రం పబ్లిసిటీ ఖర్చు అనుకుని నిర్మాత ఈ మేరకు తెగించి ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. అందుకు తగినట్లే ఓ చిన్న సినిమా టీజర్ మిలియన్ కు పైగా వ్యూస్ తెచ్చుకుంది. 

కానీ ఈ విషయం పాపులర్ అయితే ఇక చిన్న సినిమాల టీజర్, ఫస్ట్ లుక్ లు లాంచ్ చేయడానికి మన సెలబ్రిటీలు కూడా పారితోషికం తీసుకోవడం ప్రారంభం అవుతుందేమో?